మరీ ముఖ్యంగా చరణ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంది . మూవీ చూసిన ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి లానే ఉన్నాడు .. ఇండస్ట్రీ నెక్స్ట్ మెగాస్టార్ ఈ మెగా హీరోనే అంటూ ప్రశంసలతో చరణ్ ని ముంచెత్తుతున్నారు . కాగా ఈ సినిమా అంతా బాగానే ఉన్నప్పటికీ సినిమాలో కథ ఏమి పెద్దగా లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే సేమ్ టు సేమ్ పుష్ప 2 విషయంలో కూడా ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.
అల్లుఅర్జున్ జాతర ఎపిసోడ్ తప్పిస్తే అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ తప్పిస్తే పుష్ప2లో పెద్దగా ఏం చెప్పుకో తగ్గ కధ లేదు అని జనాలు మాట్లాడుకున్నారు . సుకుమార్ కథను ఇంకొంచెం హైలెట్గా రాసి ఉంటే బాగుండేది అంటూ కూడా చెప్పుకొచ్చారు. సేమ్ టు సేమ్ అలాంటి సజెషన్స్ ఇప్పుడు ఇస్తున్నారు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కి. శంకర్ "గేమ్ చేంజర్" సినిమాలో పెద్ద కథను ఏమి ఫాలో అవ్వలేదని .. కానీ రాసుకున్న క్యారెక్టర్స్ మాత్రం చాలా పక్కాగా రాసుకోవడం .. ఆ పాత్రలకు ఆ నటీనటులు బాగా న్యాయం చేయడం సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైంది అంటున్నారు . మొత్తానికి పుష్ప2 విషయంలో సుకుమార్ ఫేస్ చేసిన ప్రాబ్లమే గేమ్ చేంజర్జర్ విషయంలో శంకర్ కూడా ఫేస్ చేస్తున్నాడు . చూద్దాం మరి మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాస్తుందో..?