అయిపోయింది .. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన గేమ్ చేంజర్ సినిమా థియేటర్స్ రిలీజ్ అయిపోయింది . ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు రాంచరణ్ . అందులో నో డౌట్ . అయితే శంకర్ డైరెక్షన్ పై మాత్రం అక్కడక్కడ జనాల్లో నెగిటివ్ టాక్ వస్తుంది ఏమో అని భయపడ్డారు . అయితే అనుకున్నంత నెగిటివ్ టాక్ రాలేదు కానీ సినిమా మాత్రం మంచి హిట్ అందుకుంది . రాంచరణ్ కెరియర్ లో ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలిచిపోతుంది అంటూ సినీ విశ్లేషకులు సినీ ప్రముఖులు చెప్పుకు వస్తున్నారు .


మరీ ముఖ్యంగా చరణ్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఈ సినిమాకి 100% బాగా వర్క్ అవుట్ అయింది అంటున్నారు జనాలు. రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్ లో నటించిన తీరు ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది . అయితే ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య పెద్ద తలనొప్పి స్టార్ట్ అయింది . పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యాక నో డౌట్ ఈ సంవత్సరం నేషనల్ అవార్డు అల్లు అర్జున్ కే వస్తుంది అని.. అల్లు అర్జున్ నటన అంత అద్భుతంగా ఉందని పొగిడేశారు . అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చూశాక మెగా ఫాన్స్  చరణ్  పర్ఫామెన్స్ సైతం అద్భుతంగా ఉంది అని.. చరణ్ ఈ సినిమాతో  నేషనల్ అవార్డ్ పక్కాగా కొడతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



రంగస్థలం సినిమా ద్వారా ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు అని..కానీ గేమ్ చేంజర్ తో మాత్రం రాంచరణ్ ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ కొట్టేస్తాడు అని అంటున్నారు జనాలు. అయితే బన్నీ ఫాన్స్ మాత్రం నో డౌట్ అల్లు అర్జున్ దే ఈ సారి నేషనల్ అవార్డ్ అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ మళ్లీ మొదలైనట్టుంది . అయితే ఈ సంవత్సరం నేషనల్ అవార్డు ఎవరికి వస్తుంది అని మీరు అనుకుంటున్నారు..? పుష్ప2 సినిమాలో అద్భుతంగా నటించినా అల్లు అర్జున్ కా..? గేమ్ చేంజర్  సినిమాలో తన కొత్త పెర్ఫార్మన్స్ చూపించిన రాంచరణ్ కా..? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ ని తెలియజేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: