‘దేవర’ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల అయినప్పటికీ ఆమూవీ రికార్డులను క్రియేట్ చేయడంలో అంచనాలను అందుకోలేకపోవడంతో జూనియర్ అభిమానులు పెద్దగా జోష్ లో లేరు. దీనితో వారి ఆశలు అన్నీ బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ మూవీ పై ఉంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈమూవీని భారీ స్థాయిలో తీస్తూ బ్లాక్ బష్టర్ హిట్ చేయాలి అన్న పట్టుదల పై ఉన్నాడు.



ఈమూవీ ఆగష్టు 14న విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈమూవీకి పోటీ లేకపోవడంతో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా అదే డేట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ మూవీ విడుదల కాబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.



వాస్తవానికి ఈసినిమా ఈ సంవత్సరం సమ్మర్ రేస్ లో విడుదల అవుతుందని భావించారు. అయితే ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఆలస్యం జరిగే ఆస్కారం ఉండటంతో ఈమూవీని ఆగష్టు 14న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు రజనీకాంత్ ఈ నిర్ణయం తీసుకోవడానికి మరొక కారణం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఆగష్టు నెలలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ సాధించడంతో ఇప్పుడు అదే ఆగష్టు సెంటిమెంట్ ‘కూలీ’ కి కలిసి వస్తుందని ఈమూవీ నిర్మాతల నమ్మకం అని అంటున్నారు.  



ఇప్పటికే ‘కూలీ’ మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ తో పాటు నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ శృతి హాసన్ లాంటి ఎందరో ప్రముఖులు ఈమూవీలో నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీని పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. ‘వార్ 2’ మూవీ పై భారీ బడ్జెట్ ఖర్చు పెట్టిన నేపధ్యంలో ఈమూవీకి పోటీగా రజనీకాంత్ సినిమా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కార్నర్ అవుతాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..  









మరింత సమాచారం తెలుసుకోండి: