కాగా ఈ సినిమాలో శంకర్ మరీ ముఖ్యంగా క్యారెక్టర్స్ ను బాగా డిసైడ్ చేశాడు అంటున్నారు జనాలు. కాగా "గేమ్ చేంగర్" సినిమాలో రామ్ చరణ్ పర్ఫామెన్స్ తర్వాత అంత హైలెట్ అయిన పాత్ర ఎస్.జే సూర్యది అంటూ చెప్పుకొస్తున్నారు. ఆ తర్వాత హైలైట్ అయింది మాత్రం అంజలి పాత్ర అంటూ కూడా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంజలి ఈ సినిమాలో బాగా బాగా నటించింది అని .. ఇప్పటివరకు అంజలీని ఈ స్థాయి పెర్ఫార్మన్స్ లో ఎవరు చూడలేదు అని .. ఈ సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డు పక్క అంటూ కూడా మాట్లాడేస్తున్నారు .
అంత బాగా నటించింది అంజలి అంటూ ప్రశంసించేస్తున్నారు . అయితే కీయరా అద్వాని రోల్ బాగున్నప్పటికీ అంజలి పాత్ర అంత హైలెట్ కాలేకపోయింది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఈ సినిమాలో అంజలి క్యారెక్టర్ చాలా చాలా బాగా డిజైన్ చేశాడు శంకర్. ఆ విషయంలో శంకర్ ని ఎంత పొగిడినా తప్పులేదు. అయితే నిజానికి శంకర్ ఈ సినిమాలో కీయర అద్వానీ పాత్రలో ముందుగా అలియా భట్ ని అనుకున్నారట . అలియాబట్ ఈ పాత్రకు బాగా సూట్ అవుతుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారట . అలియాబట్ కి కూడా స్టోరీ వివరించారట. అలియా భట్ కి స్టోరీ నచ్చిన కూడా ఈ సినిమా రిజెక్ట్ చేసిందట .
దానికి కారణం ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొద్దిసేపటి క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ - ఆలియా జతకట్టారు. అయితే అందులో అలియా పాత్ర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి కూడా పెద్దగా పాజిటివ్ మార్కులు రాలేకపోయాయి . మళ్ళీ ఎక్కడ అలాంటి టాక్ వస్తుంది అన్న భయంతో అలియా ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత చాలామంది బ్యూటీస్ ని సెర్చ్ చేయగా ఫైనల్లీ హాట్ బ్యూటీ కియరా సెలెక్ట్ చేసుకున్నారట శంకర్. రామ్ చరణ్ - కీయర పెర్ఫార్మెన్స్ ల గురించి కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. మనమంతా 'వినయ విధేయ రామ' సినిమాలో చూసిందేగా...!