గేమ్ ఛేంజర్ సినిమా చూసి కొంతమందేమో బాగుందంటే మరి కొంతమంది ఏమో ఏంటయ్యా శంకరూ.. ఇంత పని చేశావు అంటూ ఇలా రకరకాలుగా రివ్యూలు ఇస్తున్నారు.ట్విట్టర్ లో ఫస్ట్ ఆఫ్ బాలేదని సెకండ్ హాఫ్ బాగుంది అని రివ్యూ ఇస్తే బెనిఫిట్ షో ముగిసాక సినిమాలు చూస్తున్న ప్రేక్షకుల నుండి ఊహించని రివ్యూలు వస్తున్నాయి.చాలామంది చెర్రీ ఫ్యాన్స్ ఈ సినిమా చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అసలు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావ్ అయ్యా సారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది నెటిజన్స్ అయితే అసలు భారతీయుడు 2 సినిమా చూశాక గేమ్ ఛేంజర్ చూడొద్దు అనుకున్నాము. కానీ సినిమాలో ఏదైనా కొత్తదనం ఉంటుంది కావచ్చు అని నమ్మకం పెట్టుకొని చూసాం.కానీ ఇది కూడా అలాగే ఉంది.సినిమా మొత్తం పార్ట్ లు పార్ట్ లు గా చూస్తే బాగానే ఉంది. కానీ మొత్తం పార్ట్ ఒకే దగ్గర చేసి చూస్తే మాత్రం దరిద్రంగా ఉంది. 

ఎందుకు బాసూ ఈ పాత చింతకాయ పచ్చడిని ఇంకా వాడతావు.. జనరేషన్ అప్డేట్ అవుతున్నట్టు నీ కథలను కూడా అప్డేట్ చెయ్యి బాసు అంటూ డైరెక్టర్ శంకర్ పై మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా చూసి వచ్చిన చాలామంది పవర్స్టార్ అభిమానులు కూడా రివ్యూలు ఇవ్వకుండా సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. ఒకవేళ రివ్యూ నెగిటివ్ గా చెప్తే ఎక్కడ తమ సినిమా గురించి తామే బ్యాడ్ గా చేసుకున్నామని ప్రేక్షకులు అనుకుంటారని సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు.దానికి సంబంధించిన వీడియోలు మనం ఇప్పటికే నెట్టింట్లో చూసాం. ఎర్ర కండువాలు వేసుకొని చెర్రీ సినిమాలు చూడడానికి వచ్చిన పవర్ స్టార్ అభిమానులు అందరూ రివ్యూ ఇవ్వకుండా సైలెంట్ గా వెళ్లిపోవడం నెట్టింట్లో వైరల్ అవుతుంది.దిల్ రాజుతో భారీ బడ్జెట్ పెట్టించి శంకర్ మాత్రం పాత చింతకాయ పచ్చడి లాగే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఇంకా అక్కడే ఉండిపోయాడు.. 

జనరేషన్ కి తగ్గట్టుగా ఆయన ఆలోచనలు మారలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. గేమ్ చేంజర్ పూర్తిగా బోరింగ్..ఇక దీన్ని ఫైనల్ గా చెప్పాలంటే ప్రెడిక్టబుల్ పొలిటికల్ డ్రామా అనుకోవచ్చు. 500 కోట్ల బడ్జెట్ సినిమాకి కనీసం 50 కోట్లు విలువ చేసే సన్నివేశం కూడా ఒక్కటి లేదు ఈ సినిమాలో. ఇందులో పాటలు ఎందుకు వచ్చాయో అర్థం అవడం లేదు. కొన్ని సీన్స్ ఎందుకు పెట్టారో కూడా తెలియడం లేదు. లాజిక్ లేకుండా సీన్స్ పెట్టడం ఏంటో అని మరో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. మారుతున్న కాలానికి తగ్గట్టు మనం కూడా మార్పు చెందాలి అక్కడే ఉండిపోతే కోరి మరీ కష్టాలు తెచ్చుకున్నట్టు ఉంటుంది అని మరో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. ఇలా సినిమా చూసిన జనాలు ఎవరికి వాళ్లు ఎక్స్ వేదికగా రివ్యూ ఇస్తున్నారు.అంతేకాదు ట్రెండింగ్లో డిజాస్టర్ గేమ్ ఛేంజర్ అంటూ యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: