గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం మెగా హీరో లేటెస్ట్ మూవీ 'గేమ్ చేంజర్' సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుంది.
ఇకపోతే శంకర్ దరకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉండే. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ద్వీపాత్రాభినేయం చేస్తుండడంతో ప్రేక్షకులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ గతంలో చేసిన ఒక పది సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నాయో.. వాటి కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసుకుందాం.
మొదటగా రామ్ చరణ్ నటించిన 'రచ్చ' సినిమా గురించి తెలుసుకుందాం. ఈ సినిమా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ లు కలిసి నిర్మించారు. రూ. 38.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ. 47.20 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టింది. 'నాయక్' వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించారు. రూ. 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ లో రూ. 47.38 కోట్ల షేర్ ని రాబట్టింది. అలాగే రాంచరణ్ హీరోగా నటించిన తుఫాన్ మూవీ అపూర్వ లాఖియా డైరెక్ట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. ఫుల్ రన్ లో కేవలం రూ. 18.2 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
అనంతరం రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఎవడు సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.44.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి… ఫుల్ రన్ ముగిసేసరికి రూ.47.10 కోట్ల షేర్ ను రాబట్టింది. టోటల్ గా బయ్యర్లకి రూ.2.6 కోట్ల వరకు లాభాలను అందించి డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇక గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ, వినయ విధేయ రామ, రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో రామ్ చరణ్ హిట్ కొట్టి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: