"నిత్యామీనన్"..తెలిసి చేసిందో.. తెలియక చేసిందో తెలియదు కానీ.. ఊహించని చిక్కుల్లో అయితే ఇరుక్కునేసింది. కాగా "కాదలిక్క నేరమిల్లే" సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో నిత్యామీనన్ ప్రవర్తించిన తీరు అందరికీ షాకింగ్ గా అనిపించింది . "కాదలిక్క్ నేరమిల్లే" సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో మీడియా పాయింట్ దగ్గరికి నిత్యామీనన్ ని ఆహ్వానించిన ఓ రిపోర్టర్ ఆమెతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆమె మాత్రం అందుకు నిరాకరించింది . అతనితో చేతులు కలిపేందుకు ఇష్టపడలేదు . అంతేకాదు తనకు హెల్త్ బాగోలేదు అంటూ కూడా చెప్పింది . "నా గొంతు సరిగ్గా లేదు ..ముందే కోవిడ్ మళ్లి వస్తుంది అంటున్నారు.." అంటూ చెప్పి నెమ్మదిగా నవ్వుతూ నిత్యామీనన్ తప్పించుకుంది .


దానికి ఆయన కూడా ఏమాత్రం నచ్చుకోకుండా మైక్ ని సరిచేసి పక్కకు వెళ్లి నిలుచున్నాడు . అయితే ఆ తర్వాత డైరెక్టర్  కి చంప మీద ముద్దు పెట్టింది.. నిత్యామీనన్ హీరో జయం రవి కి గట్టిగా హగ్ ఇచ్చింది . దీంతో సోషల్ మీడియాలో నిత్యామీనన్ ని ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు ఆకతాయిలు . "నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అన్నట్లు ఉండు ..ఒకరికి హగ్ ఇచ్చి మరొకరికి ముద్దు ఇచ్చి.. వేరొకరికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నీకు నొప్పి ఏంటి ..?"..అంటున్నారు.



"అఫ్ కోర్స్ హీరోయిన్స్ అందరు ఇలానే చేస్తున్నారు . ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అంటూ ఫ్యాన్స్ కి సైతం ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు".  అయితే నచ్చిన వాళ్ళకి షేక్ హ్యాండ్  ఇవ్వడం ..నచ్చని వాళ్ళకి ఇవ్వకపోవడం అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం.. అందులో మీకు ఏంటి బాధ ..?అంటూ నిత్యమీనన్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు.  కానీ నిత్యామీనన్ దొంగ సాకులు చెప్పుకోకుండా డైరెక్ట్ గానే నాకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇష్టం లేదు అంటూ చెప్పేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు అంటూ సజెస్ట్ చేస్తున్నారు కొందరు జనాలు . నటీనటులకు అసలు లెక్కలేదు అని ..చులకనా భావం ఎక్కువ అయిపోతుంది అని స్టార్స్ కి స్టార్స్ మాత్రమే కనిపిస్తారు అని .. చిన్న స్థాయి వ్యక్తులు కనిపించరు అంటూ ఘాటు ఘాటుగా ఆమె పేరుని ట్రోల్ చేస్తున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: