ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ కి సంబంధించిన ఇదే వార్త హైలెట్గా మారింది. నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన కారణంగా ట్రోలింగ్ కి గురి చేశారు ఆకతాయిలు. దారుణాతి దారుణంగా మాట్లాడారు.  అసలు వాడు హీరోనేనా ..? జనాల ప్రాణాలు పోతూ ఉంటే సినిమా చూస్తారా..? వాడికి బుద్ధి లేదా..? అంటూ ఘాటుఘాటుగా పలువురు స్టార్స్ కూడా మాట్లాడారు. మరి కొందరు ఏకంగా పిల్లల పెంపకం విషయంలో తల్లితండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని .. ఇంట్లో ఎలాగైనా ఊరేగచ్చు కానీ పబ్లిక్ లో మాత్రం పద్ధతిగా ఉండాలి అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు .


సీన్ కట్ చేస్తే అల్లు అర్జున్ అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు . అయితే పుష్ప2 విషయంలో మాత్రం అల్లు అర్జున్ చాలా చాలా రేర్ రికార్డ్స్ ని నెలకొల్పుతున్నారు . ఇప్పటికే పుష్ప2 ఎలాంటి రికార్డ్స్ నెలకొల్పిందో అందరికీ తెలిసిందే . వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా వసూలు చేసే పుష్ప2 ఎన్నో ఏళ్లుగా పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డ్ ను లేపేసింది . అంతేకాదు ఒక్క హిందీలోనే 800 కోట్లకు పైగా వసూలు రాబట్టింది . త్వరలోనే రెండు వేల కోట్లు కూడా వసూలు చేస్తుంది పుష్ప2 అని చెప్పుకోక తప్పదు.



అయితే రెండు వేల కోట్ల వసూళ్లతో దంగల్ మాత్రమే పుష్ప కంటే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఇప్పటివరకు రికార్డ్ నెలకొల్పింది.. త్వరలోనే ఆ రికార్డును కూడా బద్దలు కొట్టేయబోతున్నాడు అల్లు అర్జున్ . దేశంలోనే అల్లు అర్జున్ అతి పెద్ద స్టార్ గా ఎదిగిపోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే లెజెండరీ దర్శకుడుగా పాపులారిటీ సంపాదించుకున్న సంజయ్ లీలా భన్సాలీతో.. అల్లు అర్జున్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో  ఓ టాక్ వినిపిస్తుంది.



 తెలుగులో చాలామంది హీరోలు.. సంజయ్ లీలా డైరెక్షన్లో నటించాలి అంటూ కోరుకుంటున్నారు . కానీ ఆ అవకాశం ఎవరికీ రాలేదు . ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రిలో అల్లు అర్జున్ - సంజయ్ లీలా భన్సాలితో సినిమా తెరకెక్కించబోతున్నాడు అంటూ టాక్ వైరల్ అవుతుంది. దీంతో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . ఒకవేళ అదే జరిగితే మాత్రం ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో అల్లు అర్జున్ ని టచ్ చేసే హీరో ఎవరు ఉండరు అంటున్నారు అభిమానులు.. చూద్దాం ఏం జరుగుతుందో..??!

మరింత సమాచారం తెలుసుకోండి: