తెలుగు ప్రేక్షకులకు వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈమె సినిమాలలో కంటే నిరంతరం తన వ్యక్తిగత జీవితాల వల్లె ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఈమె తండ్రి కూడా సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూడా మంచి నటుడే.. ఈ నటుడు వారసురాలుగా వనిత విజయ్ కుమార్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె హీరోయిన్గా ఎన్నో సినిమాలలో నటించిన ఆ తర్వాత యాక్టర్ గా పలు చిత్రాలలో కూడా నటించింది. వనిత విజయ్ కుమార్ గత ఏడేళ్లలో ఇప్పటికే మూడుసార్లు వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.


ఇప్పటికీ కూడా ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నది వనిత విజయ్ కుమార్. తెలుగు ప్రేక్షకులకు దేవి చిత్రం ద్వారా భారీ క్రేజీ అందుకున్న ఈమె తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో నటుడు ఆకాష్ నీ సైతం ప్రేమించి వివాహం చేసుకోక విడాకులు ఇచ్చిందట. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ తర్వాత కొన్నేళ్లు ఒంటరిగా ఉన్న ఈమె ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన ఆనంద్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు జన్మించిన తర్వాత విడాకులు తీసుకున్నారు.


గత ఏడాది పీటర్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా కొద్ది రోజుకే వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పాటుగా పీటర్ అనారోగ్య సమస్యలతో మరణించారు.ఇప్పుడు మళ్లీ తిరిగి సినిమాలలో నటించాలనుకుంటున్న సమయంలో ఇటీవలే కొరియోగ్రాఫర్ రాబర్ట్ అనే వ్యక్తిని నాలుగవ పెళ్లి చేసుకోబోతుందని విషయాలు వైరల్ గా మారడంతో ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చింది.. అయితే తన తదుపరి సినిమా ప్రమోషన్స్ కోసమే అలా ప్రచారం జరిగింది అంతే తప్ప అందులో ఎలాంటి నిజం లేదంటూ వనిత విజయ్ కుమార్ వెల్లడించింది. త్వరలోనే తన కూతుర్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: