- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు ష‌ణ్ముగం శంకర్ తెరకెక్కించిన మోస్ట్‌ అవైటెడ్ సాలిడ్ మూవీగేమ్ ఛేంజర్ ” . ఎన్నో అంచనాలు మ‌ధ్య‌ వచ్చిన ఈ సినిమా అటు రామ్ చరణ్ .. అలాగే ఇటు శంకర్ కెరీర్ లో 15వ సినిమాగా వ‌చ్చింది. ఇది ఈ ఇద్ద‌రు స్టార్స్ కు 15వ సినిమా అయితే.. అలాగే దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమా కావ‌డం విశేషం. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.


దిల్ రాజు రు. 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా ను నిర్మించారు. దాదాపు 3 ఏళ్ల కు పైగా ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటూనే వ‌స్తోంది. ఇప్ప‌టికే ప‌లు సార్లు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి నా కూడా ఆల‌స్యం అవుతూనే ఉంది. ఎలాంటి ప్ర‌మోష‌న్లు లేకుండా వ‌చ్చిన గేమ్ ఛేంజ‌ర్ సినిమా బుకింగ్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా లేట్ గానే మొదలయ్యాయి.  


అయితే సినిమాకు అనుకున్న టాక్ రాలేదు. ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాల లో తొలి రోజు దాదాపు అన్ని థియేట‌ర్ల లో సినిమా వేయ‌డం కూడా మైన‌స్ అయ్యింది. శంక‌ర్ టేకింగ్ చాలా మందికి న‌చ్చ‌లేదు. దీంతో సాయంత్రం ఫ‌స్ట్ షోలు కూడా చాలా వ‌ర‌కు సీట్లు ఖాళీగా ద‌ర్శ‌న మిస్తున్నాయి. ఈవెనింగ్ షో లు కూడా డ‌ల్ గా ఉండ‌డం తో అంద‌రూ షాక్ లో నే ఉన్నారు. బాల‌య్య డాకూ మ‌హారాజ్ .. వెంకీ సంక్రాంతికి వ‌స్తున్నాం టాక్ ను బ‌ట్టే గేమ్ ఛేంజ‌ర్ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఆధార ప‌డి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: