అయితే ఈ ట్రైలర్ ను కొన్ని రోజుల ముందే రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 98 సెకన్ల నిడివి ఉన్న సెకండ్ ట్రైలర్ ద్వారా డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో వైల్డ్ యానిమల్ డైలాగ్ ద్వారా చెప్పకనే చెప్పేశారు. బాబీ డియోల్ పాత్రను సైతం ట్రైలర్ లో పవర్ ఫుల్ గా చూపించారు.
"రాయలసీమ మాలూం తేరేఖూ.. ఓ మేరా అడ్డా", "ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో నేను చంపడంలో చేశా" అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. డాకు మహారాజ్ మూవీ సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుంది. డాకు మహారాజ్ మూవీ ఇతర భాషల్లో ఒకింత ఆలస్యంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ భాషల్లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చర్చ జోరుగా జరుగుతోంది.
డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద కూడా మహారాజ్ అనిపించుకుంటారేమో చూడాల్సి ఉంది. సంక్రాంతి పండుగ విజేతగా ఏ సినిమా నిలుస్తుందనే చర్చ జరుగుతోంది. గతేడాది గుంటూరు కారం మూవీ మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించగా గేమ్ ఛేంజర్ కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలన్నీ కలెక్షన్ల విషయంలో అదరగొట్టాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. డాకు మహారాజ్ మూవీకి థియేటర్ల విషయంలో అన్యాయం జరగలేదని ఈ సినిమాకు ఒకింత మంచి థియేటర్లు దక్కాయని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.