రోజుకు 5 షోలకు మాత్రమే అనుమతులు ఉండనున్నాయి. అయితే ఈ 5 షోలలో ఒక షోను బెనిఫిట్ షోగా ప్రదర్శించే అవకాశం ఉండనుంది. తెలంగాణలో ఈ సినిమాల బుకింగ్స్ ఎప్పుడు మొదలుకానున్నాయో తెలియాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల ప్రేక్షకులే సంక్రాంతి సినిమాలను మన కంటే ముందుగా చూసే అవకాశం అయితే ఉంది. డాకు మహారాజ్ సినిమాకు బుకింగ్స్ పుంజుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
2 గంటల 22 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. డాకు మహారాజ్ సితార బ్యానర్ కు భారీ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సితార బ్యానర్ వరుస విజయాలతో విజయ భేరి మోగిస్తున్న సంగతి తెలిసిందే. సితార బ్యానర్ కు 2025 సంవత్సరం కలిసొస్తుందేమో చూడాలి. డాకు మహారాజ్ సక్సెస్ దర్శకుడు బాబీకి కూడా కీలకం అనే సంగతి తెలిసిందే.
డాకు మహారాజ్ కు బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు సైతం అనుకూలిస్తున్నాయి. డాకు మహారాజ్ మూవీ షోలు ఏపీలో ఉదయం 7.45 గంటల తర్వాతే మొదలవుతున్నాయి. డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మహారాజ్ గా నిలిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. సంక్రాంతి పండగ బాలయ్యకు అచ్చొచ్చిన పండగ కాగా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి. డాకు మహారాజ్ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. బాలయ్య పారితోషికం ఈ సినిమాకు 34 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.