గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... గేమ్ చేంజర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను శంకర్... చాలా గ్రాండ్ గా తీయడం జరిగింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో ఆయన సరసన ఇద్దరు భామలు నటించడం గమనార్హం. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ... ఉండగా... రెండవ హీరోయిన్గా అంజలి సందడి చేశారు.

 ఇక ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 450 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాలో 65 కోట్ల వరకు రామ్ చరణ్ కు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారట. అయితే ఇవాళ ఉదయం 4 గంటల నుంచి.. బెనిఫిట్ షో లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో టికెట్ రేట్లు అలాగే బెనిఫిట్ షోలు ముందు వేయమని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 దీంతో... అల్లు అర్జున్ సినిమా తరహాలోనే గేమ్ చేంజర్ సినిమా బోల్తా కొట్టింది. ఈ సినిమా కథ జనాలకు రొటీన్ గా అనిపించింది. అయితే ఇదే సమయంలో గేమ్ చేంజర్ టీంకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా ఆన్లైన్లోకి అప్పుడే వచ్చేసిందట. HD ప్రింట్ ఎవరో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ఆ సినిమాను డౌన్లోడ్ చేసుకొని మొబైల్ లో చూస్తున్నారట.

 అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర బృందం స్పందించలేదు. దీంతో ఇది నిజమైన వార్త నా? లేక ఫేకా అనేది తేలాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 70 నుంచి 95 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆ స్థాయిలో కలెక్షన్స్ రాబడితే రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అవుతుంది. ఇక ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్లో ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: