అల్లు అర్జున్ ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. అటు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఇవ్వలే రిలీజ్ అయి... కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబంలో సంబరాలు నెలకొన్న వార్త వైరల్ అవుతుంది. అయితే... గేమ్ చేంజర్ గురించి కాకుండా... తమ ఇంట్లో ప్రత్యేకమైన శుభకార్యాన్ని నిర్వహిస్తోంది అల్లు కుటుంబం. అది ఏంటో కాదు అల్లు అరవింద్ బర్త్ డే. ఇవాళ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పుట్టినరోజు.


 దీంతో ఇవాళ ఉదయం నుంచి అల్లు అరవింద్ ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. ఇంట్లో ఉన్న స్టాఫ్ అందరికీ స్వీట్లు పంచారు. కొత్త బట్టలు కూడా ఇచ్చారట. కుటుంబ సమేతంగా ఓ ప్రముఖ దేవాలయానికి కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. ఇక... కుటుంబ సభ్యుల సమక్షంలో... అల్లు అరవింద్ పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా జరిగాయి. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.


 
పుష్ప కా బాబు అంటూ... అల్లు అరవింద్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. పుష్పాక బాప్ అంటూ అడవి ఫైర్ ఎర్రచందనం దుంగలతో స్పెషల్ టీం కేక్... ఏర్పాటు చేసి అల్లు అర్జున్ ప్రత్యేకంగా సర్ప్రైజ్ చేశాడు. ఇక ఆ కేకును అల్లు అరవింద్ కట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వేడుకలో అల్లు కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. హ్యాపీ బర్త్డే డాడీ... మీ కృషితో మేము అందరం ముందుకు సాగుతున్న... మీ జీవితం మొత్తం మా కోసం కష్టపడ్డారు. అలాంటి వారు మీరు బాగుండాలి అంటూ అల్లు అర్జున్ పోస్ట్ పెట్టాడు.


 అయితే అల్లు అర్జున్ కుటుంబంలో బర్త్ డే వేడుకలు జరుగుతుంటే... అటు మెగా కుటుంబంలో గేమ్ చేంజెస్ సినిమా డిజాస్టర్ గురించి చర్చ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  కొంతమంది... అయితే గేమ్ చేంజర్ అఫ్ దిజాస్టర్ అయినందుకు అల్లు కుటుంబం ఇలా చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: