గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన తాజా సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఉదయం రిలీజ్ అయింది. ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తిగా... థియేటర్ ముందు క్యూ కట్టారు. కొంతమంది అయితే వారం రోజుల కిందటే టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. సినిమా యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ జనాలు చూసేందుకు ఎగబడుతున్నారు.


 గ్లోబల్ స్టార్ హీరోగా చేసిన గేమ్ చేంజెస్ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సరసన కూడా కియారా అద్వానీ నటించిన నేపథ్యంలో.... మరోసారి ఈ బ్యూటీ కి అవకాశం ఇచ్చారు. అయితే... కియారా అద్వానీ తో పాటు మరో అందాల తార ఈ సినిమాలో నటించింది. రెండవ హీరోయిన్గా అంజలీని తీసుకున్నారు.

 ఇక ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించారు. దాదాపు 500 కోట్లతో ఈ సినిమాను తీయడం జరిగింది.  ఈ సినిమాను దర్శకుడు శంకర్ నేరుగా తెలుగులో తీశారు. ఇలా శంకర్ నేరుగా తెలుగులో తీయడం మొదటి సారి. అది కూడా రాంచరణ్ తో గేమ్ చేంజెర్ సినిమా తీశారు దర్శకుడు శంకర్. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నేపద్యంలో....  దర్శకుడు శంకర్ కం బ్యాక్ ఇచ్చారా...? లేదా అనే చర్చ జరుగుతోంది.

 వసంత ఈ సినిమాపై చాలా నెగిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాగా నటించినప్పటికీ... దర్శకత్వం పైనే చాలామంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో సినిమా అస్సలు బాగాలేదని అంటున్నారు. అసలు ఈ సినిమా చేసింది శంకర్ యేన? అని అంటున్నారు. ఇండియన్ 2 సినిమాతో ఇటీవల అట్టర్ ఫ్లాప్ అయ్యాడు శంకర్. అంతకుముందు కూడా సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమాతో... మళ్లీ డిజాస్టర్ దర్శకుడుగా మారిపోయాడని ఈ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: