మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్... సోలోగా థియేటర్లోకి వచ్చాడు. అది కూడా దర్శకుడు శంకర్ తీసిన గేమ్ చేంజర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా ఇవాళ ఉదయం 4 గంటల నుంచి థియేటర్లలో నడుస్తోంది. బెనిఫిట్ షోలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో... ఉదయం పూట ఈ సినిమాను ప్రచురణ చేశారు.

 దీంతో జనాలంతా ఎగబడి చూస్తానని అందరూ అనుకున్నారు. కానీ సినిమా పెద్దగా క్లిక్ కాలేదని తెలుస్తోంది. సినిమాపై యావరేజ్ టాక్ రావడంతో... టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య అక్రమక్రమంగా తగ్గుతోంది. కానీ ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ బాగానే వస్తాయని చెబుతున్నారు. మరుసటి రోజు నుంచి... సినిమా ఆడడం కష్టమే అంటున్నారు. కానీ సంక్రాంతి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మెగా అభిమానులు... ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తారని చెబుతున్నారు.

 అయితే ఈ సినిమాను 450 కోట్లతో... దిల్ రాజ్ తీయడం జరిగింది. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమాను తీశారు.  అయితే ఆ బడ్జెట్ కాస్త 500 కోట్లు దాటినట్లు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ నటించినందుకు గాను 65 నుంచి 70 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా పలుసార్లు వాయిదా పడడంతో.... రెమ్యూనరేషన్ కాస్త తక్కువగానే రామ్ చరణ్ డిమాండ్ చేశారట.

 ప్రొడ్యూసర్లకు నష్టం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అటు... బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీసినిమా కోసం... ఏడు కోట్లు వసూలు చేసిందని అంటున్నారు. అంజలి కి రెండు నుంచి మూడు కోట్లు ఇచ్చారట. అటు ఎస్ జె సూర్యకు... 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ దక్కినట్లు చెబుతున్నారు. ఇక దర్శకుడు శంకర్ కు 40 కోట్ల వరకు అందినట్లు సమాచారం. అయితే సినిమా హిట్ అయితే.. కలెక్షన్లలో వాటా అడిగేవాడట రామ్ చరణ్. మరి సినిమా ముందు ముందు ఎలా ఆడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: