రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ అలాగే రాఘవేంద్ర లాంటి సినిమాలు చేసి... తెలుగు ప్రేక్షకుల మన్ననాలను పొందిన ప్రభాస్... ఆ తర్వాత చత్రపతి లాంటి సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు. ఇక చత్రపతి సినిమా హిట్ కావడంతో... ప్రభాస్ వెనక్కి చూసుకోలేదు.

 బాహుబలి, సలార్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసి... పాన్ ఇండియా స్టార్ గా  ఎదిగాడు ప్రభాస్.  ఇక... ఇప్పుడు మరో మూడు సినిమాలు వరుసలో పెట్టాడు ప్రభాస్. సాలార్ రెండవ పార్ట్, రాజా సాబ్, సందీప్ వంగా దర్శకత్వంలో మరొక సినిమా తీయబోతున్నాడు ప్రభాస్. అయితే సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు... ఒక గుడ్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ ఎదురయింది.

 అదేంటంటే... ఈ సంక్రాంతి కానుకగా ది రాజా సాబ్ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ రాబోతుందట. అలాగే ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కావాల్సిన ది రాజా సాబ్ సినిమా... వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలో తమిళ అలాగే తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా అదే సమయంలో వస్తున్నారు. దీంతో ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కావాల్సిన ప్రభాస్ సినిమా... వెనక్కి తగ్గిందట.

 దీంతో ఈ సినిమాను ఒక నెలరోజుల పాటు వాయిదా వేసి ఆ తర్వాత రిలీజ్ చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన.... అప్డేట్ సంక్రాంతి రోజున రిలీజ్ చేయనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మే నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను మారుతి తీస్తున్న సంగతి తెలిసిందే. మాళవిక మోహన్... ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అంటున్నారు. మరో ఇద్దరు భామలు కూడా ఉండబోతున్నారట. నయనతార ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: