టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహించని షాక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఏపీలో అర్ధరాత్రి సినిమాలు నడవకూడదని ఆదేశాలు జారీ చేశారట చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సినిమాలకు అర్ధరాత్రి సినిమా షోలు రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే ఉదయం నాలుగు గంటలకు షోలు కూడా రద్దు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుందట.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో సరైన పోలీసు భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించడం కష్టమని... ఏపీ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చిందట. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి ఒకటి గంట, తెల్లవారుజామున నాలుగు గంటలకు అదనపు షోలకు... అనుమతి నిరాకరించినట్లు... ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఇక పది రోజులపాటు రోజుకు 5 షోలు మించకుండా ప్రదర్శించుకోవాలని.... ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ ఐదు ప్రదర్శనలోనే... ఒక బెనిఫిట్ షో నిర్వహించుకోవచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ పేర్కొంది. అయితే మొన్నటి వరకు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు అదనపు షోలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల సవరణ కూడా చేయడం జరిగింది.

 దీంతో గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనే మూడు సినిమాలకు ఊహించని షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు కూటమి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా దీనికి సహకరించాలని కోరింది ఏపీ ప్రభుత్వం..  ఇది ఇలా ఉండగా రాంచరణ్ నటించిన గేమ్ చేజర్ ఇవ్వాళ థియేటర్లో రిలీజ్ అయింది. అటు నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజ్... ఎల్లుండి థియేటర్లలోకి రానుంది. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం 14వ తేదీన రిలీజ్ కాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: