పుష్ప 2 సినిమాతో పోటీగా గేమ్ ఛేంజర్ సినిమా ఉంటుందని చాలామంది హైపెక్కించారు. అయితే కలెక్షన్స్ పరంగా కూడా దాటుతుందని అందరూ భావించినప్పటికీ కానీ మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే పుష్ప2 దరిదాపుల్లోకి కూడా రానట్టు కనిపిస్తోందట. హిందుస్థాన్ టైమ్స్ న్యూస్ తెలిపిన సమాచారం మేరకు. మొదటిరోజు ఈ సినిమా కలెక్షన్స్ 47.13 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో 38 కోట్లు హిందీలో 7 కోట్ల రూపాయలు తమిళంలో 2 కోట్ల రూపాయలు రాబట్టినట్టుగా తెలియజేశారు.
ఇక మార్నింగ్ షో లలో 55.82% వరకు ఆక్యుపెన్సి ఉందని మ్యాట్నీ షోలలో 39.33% ఉందని ఈవినింగ్ షో లలో 50.53% ఆర్కే పెంచి నమోదు అయినట్లుగా తెలియజేశారు. మరి చిత్ర బృందం అఫీషియల్ గా ఏ మేరకు మొదటి రోజు కలెక్షన్స్ విషయం పైన ప్రకటిస్తుందో చూడాలి ఈ విషయం కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి బడా సినిమాలు సైతం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎక్కువగా రామ్ చరణ్ నటించిన సినిమాకి భారీ హైట్ ఉండేది. అయితే అభిమానులను కూడా ఈ సినిమా కొంతమేరకు నిరాశపరిచింది అనే విషయం అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. కియారాకు కూడా ఇందులో పెద్దగా ప్రాధాన్యత లేదని అంజలి పాత్ర ఓకే అన్నట్టుగా తెలుపుతున్నారు.