స్టార్ డైరెక్టర్ శంకర్ అంటే తెలియని ప్రేక్షకుడు వుండరు.. ఆయన తమిళ్ డైరెక్టర్ అయినా తన అద్భుతమైన సినిమాలతో పాన్ ఇండియా వైడ్ ఎంతో పాపులర్ అయ్యారు.. భారీ సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు శంకర్.. గతంలో ఆయన సినిమా వస్తుందంటే చాలు తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు..కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ ఇవ్వడం శంకర్ స్టైల్.. శంకర్ తన కెరీర్ లో కమలహాసన్, రజనీకాంత్ వంటి లెజెండ్రి యాక్టర్స్ తో సినిమాలు చేసి వారికి భారీ బ్లాక్ బస్టర్స్ అందించాడు.. అయితే గత కొన్నేళ్లుగా శంకర్ సినిమాలలో ఆ మ్యాజిక్ మిస్ అవుతూ వస్తుంది.. తాను తెరకెక్కించిన ఐ, 2.O, భారతీయుడు 2 ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాయి.. ఈ సినిమాలు అసలు శంకరే తెరకెక్కించారా అనే అనుమానం కలిగించాయి..అయితే తన కెరీర్ ప్రారంభం అయిన ఇన్నేళ్లకు శంకర్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసారు.. 

గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో “ “గేమ్ ఛేంజర్” అనే  బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామాను తెరకెక్కించారు.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది..ఈ సినిమా కథ పాతది అయినా కథనంలో శంకర్ కొత్తదనం చూపించలేదని కొందరు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.. 

బెస్ట్ పెర్ఫార్మర్ రాంచరణ్ అద్భుతమైన నటనతో అదరగొట్టినా కానీ చరణ్ ను శంకర్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు.. అలాగే అంతమంది కమెడియన్స్ వున్నా కామెడీ లేకపోవడం అతి పెద్ద మైనస్.. సినిమాను ఎంతో గ్రాండియర్  గా తెరకెక్కించారు.. పెట్టిన బడ్జెట్ అంతా పాటలకే పరిమితం అయిందని అనిపిస్తుంది.. పాటల కోసం మేకర్స్ భారీగా ఖర్చు పెట్టి ఎంతో క్వాలిటీ తో తెరకెక్కించారు.. శంకర్ పనితనం అంతా పాటలకే పరిమితం అయిందని సినిమా కథపై కూడా ఆయన దృష్టి పెట్టి ఉండుంటే గేమ్ ఛేంజర్ గట్టెక్కేదేమో అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: