తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే చాలు కచ్చితంగా బడా హీరోల చిత్రాలు విడుదలవుతూ పోటీ పడుతూ ఉంటాయి. ఇందులో హిట్ ఫట్ అనే సంబంధాలు లేకుండా సినిమాల చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్త ఏడాది సంక్రాంతి బరిలో మాత్రం చాలామంది హీరోలు పోటీ పడుతూ ఉంటారు. ఈసారి కూడా సంక్రాంతికి సీనియర్ హీరో అయిన బాలయ్య డాకు మహారాజు సినిమాతో బరిలోకి దిగబోతున్నారు. బాలకృష్ణ ఈ మధ్య సంక్రాంతి సెంటిమెంట్ మరింత ఎక్కువ అయిందని చెప్పవచ్చు. మరి బాలయ్య సంక్రాంతి సినిమాలు ఎన్ని విడుదల చేశారు ఎన్ని సక్సెస్ అందుకున్నారో చూద్దాం..?


మొదటిసారిగా 1985 జనవరి 11న ఆత్మబలం అనే సినిమాతో సోలో హీరోగా బాలయ్య ఎంట్రీ ఇవ్వక  సినిమా డిజాస్టర్ గా మిగిలిందట.

1987 జనవరి 14న భార్గవ రాముడు ప్రేక్షకుల ముందుకు వచ్చాక ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.


1998 జనవరి 15న విడుదలైన ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా సంక్రాంతి హిట్టుగా నిలిచిందట.


1989 జనవరి 15న విడుదలైన భలే దొంగలు సినిమా హిట్ టాక్ అనిపించుకుందట.


1990 జనవరి 12న విడుదలైన ప్రాణానికి ప్రాణం సినిమా తో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు బాలయ్య.


1996న జనవరి 5 విడుదలైన వంశానికొక్కడు సినిమా యావరేజ్ గా నిలిచిందట.


1997 జనవరి 10న పెద్దన్నయ్య సినిమాతో వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది.


1999లో జనవరి 13న  సమరసింహారెడ్డి  సినిమాతో తన కెరియర్ లోని హిస్టరీని మార్చేసుకున్నారు బాలయ్య. అప్పటివరకు ఉన్న సినీ ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగ రాశారట.


2000 జనవరి 14న విడుదలైన వంశోద్ధారకుడు సినిమా ఫ్లాప్ గా మిగిలింది.


2001 జనవరి 11న నరసింహనాయుడు సినిమాతో మరొకసారి ఇండస్ట్రీ హిట్టు అందుకున్నారు.


2002 జనవరి 11న సీమ సింహం సినిమా విడుదలై ఫ్లాప్ గా మిగిలింది.


2004 జనవరి 14న లక్ష్మీనరసింహ సినిమాతో పరవాలేదు అనిపించుకున్నారు.

2008 జనవరి 10న ఒక్క మగాడు సినిమా ఫ్లాప్ గా మిగిలింది.

2011 జనవరి 12న విడుదలైన పరమవీరచక్ర ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది.

2016 జనవరి 14న డిక్టేటర్ విడుదలవ్వగా పరవాలేదు అనిపించుకున్నారు.


2017 జనవరి 12న గౌతమీపుత్ర శాతకర్ణతో హిట్ అందుకున్నారు.


2018 జనవరి 12న జై సింహా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

2019 ఎన్టీఆర్ కథానాయకుడుతో నిరాశని మిగిల్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: