చాలామంది దర్శక, నిర్మాతలు సినిమాలు తీసేటప్పుడు  కేవలం టెక్నాలజీ కాకుండా ఆస్ట్రాలజీని కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే సినిమాలు ప్రారంభించేటప్పుడు మంచి టైం చూసుకొని ప్రారంభిస్తారు. దీనివల్ల సినిమా మంచి ఎఫెక్ట్ తో ముందుకు వెళ్లి, హిట్ అవుతుందని నమ్ముతారు. ఇలా సినిమాల్లో చాలావరకు  సెంటిమెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలా కొంతమంది డైరెక్టర్లు సెంటిమెంటు ప్రకారం  సినిమాల్లో కొన్ని సీన్లు అన్ని చిత్రాలలో వాడుకుంటారు. కొంతమంది సినిమాకు ముందు వారికి నచ్చిన దేవుణ్ణి చూపిస్తే, మరి కొంతమంది వారికి నచ్చిన లొకేషన్స్ చూపిస్తూ ఉంటారు. దీనివల్ల వారికి కలిసి వస్తుందని నమ్ముతారు. అలా ఇండస్ట్రీలో కొంతమందికి సంక్రాంతి కలిసివస్తే మరి కొంతమందికి దసరా కలిసి వస్తుంది. కానీ ఇండస్ట్రీలో కొన్ని డేట్స్ మాత్రం దర్శక నిర్మాతలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆ డేట్స్ ఏంటయ్యా అంటే జనవరి 10వ తేదీ..ఈ తేదీన రిలీజ్ అయిన చాలా సినిమాలు ఇప్పటివరకు డిజాస్టర్ అయ్యాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..

జనవరి 10న రిలీజ్ అయిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది మహేష్ బాబు మూవీ.. ది గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి "వన్ నేనొక్కడినే" మూవీ ఎన్నో అంచనాల మధ్య జనవరి 10, 2014లో విడుదలైంది.. భారీ అంచనాల మధ్య వచ్చినటువంటి ఈ సినిమా డిజాస్టర్ టాక్ తో పూర్తిగా బోల్తా పడింది.. ఇక ఈ మూవీ తర్వాత  ఆ డేట్ లో రిలీజ్ చేసి ఫెయిల్ అయిన మరో  దర్శకుడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ  అజ్ఞాతవాసి.. వీరిద్దరి కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదే టైంలో జనవరి 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయి  బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. 

ఇక ఈ చిత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్.. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీ ద్వారా తన లైఫ్ చేంజ్ అవుతుందని అనుకున్నారు. కానీ జనవరి 10, 2025 లో రిలీజ్ అయిన ఈ మూవీ  బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. ఈ విధంగా జనవరి 10న రిలీజ్ అయిన  చాలా సినిమాలు సెంటిమెంటల్ గా కలిసి రావడం లేదని కొంతమంది నమ్ముతున్నారు. మరి అదే రామ్ చరణ్ పై కూడా పడుతుందా లేదంటే సినిమా ముందు ముందు కలెక్షన్స్ రాబడుతుందా అనేది రాబోవు రోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: