రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం డిజాస్టర్ గేమ్ చేంజర్ అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బెనిఫిట్ షో తో హిట్టు టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత చూసిన జనాలు మాత్రం సినిమా అస్సలు బాలేదు అంటూ రివ్యూలు ఇస్తున్నారు.దీంతో రామ్ చరణ్ కి రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ వచ్చి పడింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమాలో నటించిన తర్వాత హీరోలు చేసే వరుస సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అదే రాజమౌళి సెంటిమెంట్ అని ఇండస్ట్రీలో ఓ పేరు వచ్చేసింది.కానీ రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ రామ్ చరణ్ ని బ్రేక్ చేశారని వార్తలు వినిపించాయి.కానీ ఎన్టీఆర్ బ్రేక్ చేసినప్పటికీ రామ్ చరణ్ మాత్రం బ్రేక్ చేయలేదని తెలుస్తోంది.

ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం దాదాపు 47 కోట్లు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది. ఈ లెక్కన 50 కోట్లు కూడా మొదటి రోజు వసూలు చేయకపోతే 450 కి పైగా బడ్జెట్ పెట్టిన ఈ సినిమా కనీసం రెండు మూడు వందల కోట్లు కూడా కలెక్ట్ చేస్తుందనే నమ్మకం చాలా మందిలో పోయింది. అయితే ఇప్పటివరకు అఫీషియల్ గా చిత్ర యూనిట్ అయితే ఈ సినిమాకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్లను విడుదల చేయలేదు. మరి చిత్ర యూనిట్ బయటపెట్టే ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి. ఈ విషయం పక్కన పెడితే..గేమ్ ఛేంజర్  సినిమా వల్ల రామ్ చరణ్ 100 కోట్లు నష్టపోయారట. అదెలా అంటే...గేమ్ ఛేంజర్ సినిమా చేసే సమయంలో రామ్ చరణ్ కి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాని ఒప్పుకున్నారట.

సినిమా  యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అప్పట్లో ఇచ్చేశారు.అయితే గేమ్ ఛేంజర్ సినిమాకి  కమిట్ అవ్వడం కారణంగా ఈ సినిమా నుండి రాంచరణ్ తప్పుకున్నారట.అయితే గౌతమ్ తిన్ననూరి సినిమాలో రామ్ చరణ్ కి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని కూడా ఒప్పుకున్నారట. కానీ సడన్గా గేమ్ ఛేంజర్ సినిమా తెరమీదకి రావడంతో గౌతమ్ తిన్ననూరి సినిమాని పక్కన పెట్టేసారు రామ్ చరణ్. అయితే తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఇక ఈ రిజల్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ 100 కోట్లు వదిలేసుకున్నాడు. దురదృష్టం అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక గేమ్ చేంజర్ మూవీ లో నటించినందుకు గాను రామ్ చరణ్ 65 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ కి డిజాస్టర్ టాక్ రావడం మాత్రం మెగా ఫ్యాన్స్ ని తీవ్రంగా హార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: