ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులను శంకర్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభించినప్పటి నుండి చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన విజయాలను అందుకుంటు ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం శంకర్ తన మార్క్ ను చూపించడంలో వరుసగా విఫలం అవుతూనే వస్తున్నాడు. ఆఖరుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాతే ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు.

ఇకపోతే శంకర్ తన కెరియర్ ప్రారంభంలో ఒక సోషల్ మెసేజ్ మధ్యలో ఒక స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న కథలతో ప్రేక్షకులను మెప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన సినిమా మొత్తం ఏ స్థాయిలో ఉంటుందో ఆ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతకు మించి ఉండడం , ఆ ఫ్లాష్ బ్యాక్ వల్ల సినిమాకే ప్లేస్ కావడం అలా అద్భుతమైన విజయాలను శంకర్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే భారతీయుడు 2 తో భారీ డిజాస్టర్ ను అందుకున్న శంకర్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.


మూవీ లో రామ్ చరణ్ హీరో గా నటించాడు. ఈ మూవీ తో అయిన శంకర్ కం బ్యాక్ ఇస్తాడేమో అని చాలా మంది భావించారు. కానీ ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది అని తెలుస్తుంది. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఓ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఫ్లాష్ బ్యాక్ వరకు ప్రేక్షకులను సినిమా బాగానే ఆకట్టుకున్న మిగతా సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వస్తుంది. ఇక ఆయనను చాలా సార్లు కాపాడిన ఫార్మేట్ గేమ్ చేంజర్ విషయంలో వర్కౌట్ కాలేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: