టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం సంక్రాంతి పండుగకు అనేక తెలుగు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. దానితో జనాలు కూడా ఆ సినిమాలను థియేటర్లలో చూడడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. దానితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ల మధ్య అద్భుతమైన సందడి వాతావరణం సంక్రాంతి పండుగ సందర్భంలో నెలకొంటూ ఉంటుంది.

ఇక ప్రేక్షకులు ఎక్కువ శాతం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే థియేటర్లలో సినిమాలో చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడంతో ఆ సమయంలో విడుదల అయ్యి యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు అద్భుతమైన కలెక్షన్ లు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే మంచి టాక్ వచ్చిన సినిమాలుకు బ్లాక్ బస్టర్ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , బాలకృష్ణ హీరో గా రూపొందిన డాకు మహారాజ్ , వెంకటేష్ హీరో గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల అయింది.  

ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కొంత మంది ఈ సినిమాకు ఇలాంటి టాక్ ను మేకర్స్ ముందే ఊహించుకుంటారు. అందుకే సంక్రాంతి బరిలో ఈ మూవీ ని నిలిపారు. సంక్రాంతి బరిలో సినిమా ఉంటే ఆటోమేటిక్ గా ఎంతో కొంత మంచి కలెక్షన్లు వస్తాయి. అందుకే ఈ సినిమాను ఈ టైం లో విడుదల చేశారు అని అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: