నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబి దర్శకత్వంలో సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం డాకు మహారాజ్.. ఈమధ్య బాలయ్య వరుస సినిమాలతో సక్సెస్ అందుకోవడమే కాకుండా.. అభిమానులను మెప్పించి సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చేలా తన సినిమాలలో చూసుకుంటున్నారు. అందుకే బాలయ్య సినిమాలు కూడా నిర్మాతలు బడ్జెట్ పెట్టడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. డాకు మహారాజ్ సినిమా కోసం నిర్మాత నాగవంశి కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.అందుకే సినిమా పైన చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నామంటూ ఇప్పటికే చాలా సందర్భాలలో తెలియజేశారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



తాజాగా డాకు మహారాజ్ సినిమా రెండవ ట్రైలర్ ని కూడా విడుదల చేయక అంచనాలను పెంచేసేలా కనిపిస్తోంది. ఇక తమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ అదరగొట్టేసారని ట్రైలర్లో చూస్తే కనిపిస్తోంది. పాటలు కూడా ఒక మోస్తాదులో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా డాకు మహారాజ్ సినిమా కథ ఇదే అంటూ ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది వాటి గురించి చూద్దాం..

స్టోరీ విషయానికి వస్తే:
రాజస్థాన్ కి ప్రాంతానికి చెందినటువంటి  విరాజు సుర్వి (బాబీ డియోల్) అక్కడ ప్రజలను సైతం చాలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారట. అయితే ఆ తర్వాత ప్రాంతాలను ఆక్రమించి వస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల పైన ఈ రాజు కన్ను పడుతుంది. అయితే ఈ క్రమంలోనే నానాజీ (బాలకృష్ణ) విరాజు సుర్విని ఎలా అడ్డుకుంటారు ?.. పాప కోసం బాలయ్య వారి కుటుంబంలోకి ఎందుకు అడుగు పెడతారు? అసలు ఆ పాప ఎవరు? నానాజీ.. డాకు మహారాజుగా ఎలా మారుతారు అనే కథని నాకు మహారాజు కథ అన్నట్టుగా తెలుస్తోంది.


అయితే కథపరంగా కొత్తగా ఏమీ లేకపోయినా కానీ డైరెక్టర్ బాబీ మాత్రం కొత్త స్క్రీన్ ప్లే గా ఈ సినిమాని చూపించారట. ఇంటర్వెల్ సినిమా కూడా బ్లాస్ట్ అయ్యేలా ఉంటుందని సెకండ్ హాఫ్ ఆడియన్స్ ని మరింత అట్రాక్ట్ అయ్యేలా చేస్తుందని మాస్ ఆడియన్స్ ని మరొకసారి బాలయ్య మెప్పించేలా ఉంటుందని తెలుపుతున్నారు. అలాగే ఇందులో కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయని సినీ వర్గాల నుంచి తాకు వినిపిస్తోంది మరి ఏ మేరకు ఈ సినిమా బాలయ్యకు సంక్రాంతి విన్నర్ ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: