రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది. మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో గేమ్ ఛేంజర్ మూవీ గురించి ఇలాంటి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే గేమ్ ఛేంజర్ సినిమాలో తప్పులు లేవా అంటే తప్పులు ఎక్కువగానే ఉన్నాయి.
 
ఏ దర్శకుడు అయినా ప్రతి సినిమాను కొత్తగా తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమా చూస్తే మాత్రం చరణ్ గత సినిమాలన్నీ కలిపి ఈ సినిమా తీశారని ఒక కొత్త సినిమా చూశామనే ఫీలింగ్ ఏ మాత్రం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో హిట్టైన సాంగ్స్ లో నానా హైరానా సాంగ్ ముందువరసలో ఉంటుంది. సినిమాలో ఈ సాంగ్ లేకపోవడం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది.
 
మూడేళ్ల క్రితమే సాంగ్స్ షూటింగ్ పూర్తైనా సాంగ్ యాడ్ చేయలేకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ లో లెక్కకు మిక్కిలి కమెడియన్లు ఉన్నా ఒక్క సీన్ లో కూడా నవ్వు రాలేదు. ఇంటర్వల్ ట్విస్ట్ తో మెప్పించిన శంకర్ క్లైమాక్స్ లో మ్యాజిక్ చేయడంలో విఫలమయ్యారు. ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న పాత్రను బాగానే డిజైన్ చేసినా ఆ పాత్రకు లోపం ఉండటం కూడా కొంతమంది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.
 
గేమ్ ఛేంజర్ మూవీలో వాస్తవానికి దూరంగా ఉన్న సీన్లు ఎక్కువగానే ఉన్నాయి. పార్వతి పాత్ర తన కొడుకు పక్కనే ఉన్నా మొదట గుర్తించకపోవడం గురించి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ లో శ్రీకాంత్ పాత్రను రెండు డిఫరెంట్ షేడ్స్ లో చూపించడం కూడా ఫ్యాన్స్ కు నచ్చలేదు. ముఖ్యమంత్రి మరణిస్తే కనీసం పోస్టుమార్టం కూడా చేయరా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
గేమ్ ఛేంజర్ మూవీలో చిన్న సీన్లకు సైతం పేరున్న నటీనటులను పెట్టి బడ్జెట్ వృథా చేశారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. శంకర్ సినిమాలకు సుజాత రంగనాథన్ లేని లోటు క్లియర్ గా తెలుస్తోంది. అలాంటి టాలెంటెడ్ రైటర్ ను పట్టుకోవడంలో దర్శకుడు శంకర్ విఫలమయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద శంకర్ గేమ్ ఓవర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: