ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో భాగంగా నిన్న అనగా జనవరి 10 వ తేదీన రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి బరిలో భాగంగా రంగం లోకి దిగింది. ఇక ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక రేపు అనగా జనవరి 12 వ తేదీన డాకు మహారాజ్ , జనవరి 14 వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. ఇకపోతే ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఓ పాత న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అదేమిటి అనే వివరాల్లోకి వెళదాం.

2019 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ విధేయ రామ , బాలకృష్ణ హీరోగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు , విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 2 సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సినిమాలలో వినయ విధేయ రామ , ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చింది. దానితో ఈ రెండు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఎఫ్ 2 సినిమాకు బ్లాక్ బస్టర్ రావడంతో ఈ మూవీ భారీ కలక్షన్లను వసూలు చేసి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక ఈ సంవత్సరం కూడా ఈ ముగ్గురు హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతూ ఉండడం , అందులో మొదటి విడుదల అయిన చరణ్ మూవీ కి ఫ్లాప్ టాక్ రావడంతో డాకు మహారాజ్ సినిమాకు ఈ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యేనా అని బాలయ్య అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: