నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని... దుమ్ము లేపుతూ ముందుకు సాగుతున్నాడు నందమూరి బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యేగా అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా నందమూరి బాలయ్య కొనసాగుతున్నాడు. అయితే అలాంటి నందమూరి బాలయ్య ఇప్పుడు సంక్రాంతి కానుకగా డాకు మహారాజు సినిమాతో వస్తున్నాడు. ప్రతి సంక్రాంతికి ఏదో ఒక సినిమాతో వచ్చే బాలయ్య ఈసారి డాకు మహారాజ్ అంటున్నాడు.

 దోపిడి రాజ్యాన్ని, అలాగే ఓ చిన్నారి కోసం చేసే పోరాటమే ఈ డాకు మహారాజ్. అయితే ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ముగ్గురు స్టార్ హీరోలు బరిలో నిలిచారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేజర్ తో నిన్నటి నుంచి సందడి చేస్తున్నాడు. ఇక బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో వస్తున్నాడు. ఇక సంక్రాంతి రోజున అంటే జనవరి 14వ సంక్రాంతికి వస్తున్నాం అంటూ విక్టరీ వెంకటేష్ సందడి చేయబోతున్నాడు.

 అయితే ఈ ముగ్గురు సినిమాలు ఉన్నప్పటికీ బాలయ్య సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇక నిన్న రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ తేలిపోవడంతో... నందమూరి బాలయ్య కు లైన్ క్లియర్ అయింది. కచ్చితంగా డాకు మహారాజు... విపరీతంగా కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్  పైన పాజిటివ్ టాక్ వస్తే నందమూరి బాలయ్యకు ఇబ్బందులు వచ్చేవి.

 కానీ ఇప్పుడు అవలీలగా మూడు నుంచి 400 కోట్లు ఆ సినిమా వసూలు చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక అటు విక్టరీ వెంకటేష్ సినిమా ఫ్యామిలీ నేపథ్యంలో వస్తోంది. మాస్ ఫాన్స్ కు పెద్దగా అది నచ్చకపోవచ్చు. కాబట్టి సంక్రాంతి బరిలో నిలిచిన దాకు మహారాజు బ్లాక్ బాస్టర్ కావడం గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు సినిమా విశ్లేషకులు. దానికి తోడు ఏపీలో ఈ డాకు మహారాజ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: