ఇక ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు 450 కోట్లకు పైగా పెట్టి.... గ్రాండ్ గా తీశారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా... యావరేజ్ టాక్ తెచ్చుకోవడం ఏ కాకుండా భారీ డిజాస్టర్ అన్నట్లుగా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నిన్న ఒక్కరోజు 90 కోట్లు వసూలు చేయాల్సిన ఈ సినిమా 40 నుంచి 50 కోట్ల మధ్య మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా ఇంత డిజాస్టర్ గా మారడానికి కారణం శంకర్ అంటున్నారు. శంకర్ పొలిటికల్ డ్రామాను సరిగా వాడుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ గేమ్ చేంజర్ సినిమాలో... కామెడీని పండించలేకపోయాడు దర్శకుడు శంకర్. అలాగే రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కథను... మరింత డెవలప్ చేసి ఉంటే బాగుండేది. ఎత్తులకు పైఎత్తులు అన్నట్లుగా... ఈ సినిమాలో పొలిటికల్ డ్రామా ను ప్లే చేయాల్సి ఉండేది.
అలాగే రామ్ చరణ్ ను బాగా వాడుకున్నాడు కానీ అతనితో... డాన్స్ ఎక్కువగా చేపించలేకపోయాడు. కాబట్టి కొరియోగ్రాఫర్ మిస్టేక్ కూడా ఉంది. అలాగే ఈ సినిమాలో కీలకమైన సాంగ్ వదిలేశారు. అటు బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీని ఎందుకు పెట్టారో అని అర్థం వచ్చేలా జనాలకు బోర్ తెప్పించారు. ఇక అంజలి యాక్టింగ్ మాత్రం అదరగొట్టింది. సినిమా కథను రొటీన్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా చేసి ఉంటే సినిమా సక్సెస్ అయ్యేది. ఇండియన్ 2 కంటే దారుణంగా ఉందని జనాలు అంటున్నారు. కాబట్టి శంకర్ ఇకనైనా మారాలని కోరుతున్నారు.
[8:52 AM, 1/11/2025] Saikiran: