కియారా అద్వానీ రెండుసార్లు సినిమాను ముంచేసిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చరణ్ కియారా అద్వానీ ఫ్లాప్ జోడీనే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమా కోసం 8 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకున్నారని సమాచారం అందుతోంది. దిల్ రాజుకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చే ఛాన్స్ అయితే ఉంది.
గతంలో పలు సినిమాలతో నిరాశ పరిచిన దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాతో అంతకు మించి నిరాశపరిచారు. దిల్ రాజు భారీ సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటే మంచిదని నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ నిర్మాతలకు ఎంతమేర నష్టాలను మిగుల్చుతుందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
సంక్రాంతి పండుగకు విడుదలవుతున్న ఇతర సినిమాల ఫలితాలను బట్టి ఈ సంక్రాంతి సినిమాల కలెక్షన్లు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. డాకు మహారాజ్ మూవీ నుంచి తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు వచ్చిన టాక్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ను సైతం ఒకింత బాధ పెట్టిందనే చెప్పాలి. సంక్రాంతి సినిమాలు నిరాశకు గురి చేస్తే సినీ అభిమానులు సైతం బాధ పడే ఛాన్స్ ఉంది.