ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ నుండి అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 2 , రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు విడుదల అయిన విషయాలు మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాల విషయంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి , సుకుమార్ చేసిన కామెంట్స్ వాటికి వచ్చిన రిజల్ట్స్ విషయంలో అనేక మంది అనేక రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

అసలు విషయం లోకి వెళితే... అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆ ఈవెంట్లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ ... ఈ సినిమాలోని హీరో ఇంట్రో సన్నివేశాన్ని నాకు సుకుమార్ చూపించాడు. అది అద్భుతంగా ఉంది. ఆ సన్నివేశం సినిమాకే హైలైట్ కానుంది అని చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి చెప్పడంతో ఈ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది అని జనాలు అనుకున్నారు. కానీ రాజమౌళి చెప్పిన స్థాయిలో పుష్ప పార్ట్ 2 లో అల్లు అర్జున్ ఇంట్రో సీన్ లేదు అని సినిమా విడుదల తర్వాత చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇకపోతే తాజాగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ కి సంబంధించిన ఓ ఈవెంట్లో సుకుమార్ పాల్గొన్నాడు. అందులో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ ... గేమ్ చేంజర్ సినిమాను నేను చిరంజీవితో కలిసి చూశాను. ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే విధంగా కామెంట్స్ చేశాడు. ఇక నిన్న విడుదల అయిన సినిమా మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో అనేక మంది అనేక రకాలుగా సుకుమార్ కామెంట్స్ పై అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: