దిల్ రాజు నిర్మాతగా చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్..శంకర్ దర్శకత్వంలో సినిమాలు వస్తున్నాయంటే ఒకప్పుడు సినిమాలో ఎలాంటి మ్యాజిక్స్ ఉంటాయో అని చాలామంది ప్రేక్షకులు సినిమా చూడడానికి ఎగబడేవారు.కానీ ఈ మధ్యకాలంలో శంకర్ చేసే సినిమాలన్నీ అంతా ఆసక్తికరంగా లేవు. పాత చింతకాయ పచ్చడి అన్నట్లు అన్నీ పాత పాత కాన్సెప్ట్ లు తీసుకొని చేయడంతో ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు సినిమాలు చూడడానికి ఇష్టపడడం లేదు. అయితే తాజాగా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాకి సంబంధించి కూడా అలాంటి టాకే వినిపిస్తుంది.శంకర్ జనరేషన్ కి తగ్గట్టు మారి తన దర్శకత్వంలో ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే చేయకపోతే నెక్స్ట్ అసలు శంకర్ సినిమాలు చూడడానికి కూడా ఎవరూ రారు అని సోషల్ మీడియా వేదికగా శంకర్ పై ట్రోల్స్ వినిపిస్తున్నాయి... 

అలాగే గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ బాగున్నప్పటికీ సినిమా చూస్తే మాత్రం అస్సలు ఇంట్రెస్టింగ్ గా లేదని సినిమా చేసిన జనాల టాక్.అలాగే లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలు పెట్టడం, లవ్ స్టోరీ బాగా తీయకపోవడం,కామెడీ లేకపోవడం కూడా సినిమా చూసే ప్రేక్షకులకు బోరింగ్ గా అనిపించేది. అయితే ఈ సినిమాకి దిల్ రాజు భారీ బడ్జెట్ పెట్టాడు. స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో ఇద్దరు కాంబోలో సినిమా అంటే సినిమా మరో లెవెల్ లో ఉంటుంది అని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు అని దిల్ రాజు అనుకున్నారు.అలా 450 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. అయితే ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్లు 50 కోట్లు కూడా రాలేదని కొన్ని వెబ్ సైట్స్ రాసుకువచ్చాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి దిల్ రాజు అనవసరంగా బడ్జెట్ పెట్టాడని సోషల్ మీడియాలో ఈయనపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాదు ఈ సినిమా చూసిన కొంతమంది అయితే మరో ఆచార్య, ఆచార్య-2 అంటూ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక మరికొంత మందేమో దిల్ రాజు పై, మెగా ఫ్యామిలీ పై ట్రోలింగ్ చేస్తూ ఎందుకయ్యా దిల్ రాజు అంత బడ్జెట్ పెట్టావు..సినిమా ప్లాప్ అయితే కనీసం మెగా ఫ్యామిలీ నిర్మాతలని పట్టించుకోదు అంటూ ట్రోల్స్ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన సినీ క్రిటిక్స్ కూడా దిల్ రాజు అంత బడ్జెట్ పెట్టకపోయి ఉంటే బాగుండేది. స్టార్ దర్శకుడు హీరో అని బడ్జెట్ పెడితే ఉన్నదంతా ఉడ్చుకుపోయేలా ఉంది.కనీసం 100 కోట్లు కూడా వస్తాయో లేదో అనే డౌట్ ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే సినిమా మరీ అంత నెగటివ్ గా అయితే లేదు. పెట్టిన బడ్జెట్ వస్తుందనే అయితే నమ్మకం ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ లో ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: