మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'గేమ్ ఛేంజర్' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దిల్ రాజు నిర్మాణ విలువలకు, రామ్ చరణ్ తండ్రి కొడుకుల డ్యూయల్ రోల్‌కు తోడు.. ఈ సినిమాలోని పాటలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా 'దోప్ సాంగ్' అయితే ఓ ఊపు ఊపేసింది. ఇక యూత్‌ను ఓ ఊపు ఊపేస్తున్న మరో మాస్ బీట్.. 'రా మచ్చా'. ఈ పాటకు కేవలం అబ్బాయిలే కాదు, అమ్మాయిలు సైతం ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ పాటకు సంబంధించిన రీల్స్‌తో హోరెత్తిస్తున్నారు.

తాజాగా, ఓ గర్ల్స్ గ్యాంగ్ థియేటర్ ముందు గుంపుగా చేరి మరీ 'రా మచ్చా' పాటకు అద్భుతంగా స్టెప్పులేశారు. రామ్ చరణ్ గ్రేస్‌కు ఏ మాత్రం తగ్గకుండా వీరు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ అమ్మాయిల డ్యాన్స్ చూసిన మెగా ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. "రామ్ చరణ్ పేరు నిలబెట్టారు." అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. చిన్న తప్పు కూడా లేకుండా అంత పర్ఫెక్ట్‌గా డ్యాన్స్ చేశారంటే.. ఆ పాటకు వాళ్లెంత కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా, మరో వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'గేమ్ ఛేంజర్' లోని మరో పాటకు ఓ అమ్మాయి ఒంటరిగా డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, గ్రేస్‌ఫుల్ మూవ్స్‌తో అందరినీ ముగ్ధులను చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె డ్యాన్స్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.

దర్శకుడు శంకర్ తన సినిమాలలోని పాటల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా నిర్మాత దిల్ రాజు చెప్పినట్లు.. ఈ సినిమాలో ఒక్కో పాటకు ఏకంగా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. అంటే ఆ పాటలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఆ విజువల్ ట్రీట్‌ను థియేటర్‌లోనే చూడాలి.. అప్పుడే ఆ మజా వేరుంటుంది.
https://x.com/OnlyForRC45/status/1875495387253109180​​​

మరింత సమాచారం తెలుసుకోండి: