అంతకుముందు కూడా శిఖర్ పెహరియాతో చాలాసార్లు శ్రీవారిని దర్శించుకుంది . కానీ ఈసారి మోస్ట్ స్పెషల్గా కనిపించింది . అంతేకాదు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి నిశ్చితార్థం అయిపోయింది అంటూ వార్తలు వచ్చేసాయి. బాలీవుడ్ మీడియాలో అయితే త్వరలోనే వీళ్ల పెళ్లి అంటూ కూడా టాక్ వినిపించింది . అయితే కొంతమంది కూసింత ముందు స్టెప్ వేసి జాన్వి కపూర్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అంటూ బిగ్ రూమర్స్ కూడా క్రియేట్ చేసేసారు . స్టార్ హీరోయిన్ కావడంతో రూమర్స్ త్వరగా స్ప్రెడ్ అయిపోయాయి .
దీంతో జాన్వీ కపూర్ ఫుల్ సీరియస్ అయిపోయినట్లు తెలుస్తుంది . ఇలా ఎలా వార్తలు రాయగలరు..? ఇలా ఎలా అనుకోగలరు..? ఒక అబ్బాయి అమ్మాయి కలిసి గుడికి వెళ్ళినంత మాత్రాన ఇలా రాసేస్తారా..? అనుకునేస్తారా..? అంటూ ఫుల్ ఫైర్ అయిపోయిందట . అంతేకాదు చాలామంది ఆమె ఫ్రెండ్స్ "నువ్వు ప్రెగ్నెంటా..?" అంటూ ఆమెకు కాల్ చేసి మరి అడగడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట. అసలు ఇలా ఎలా మారిపోతారు అంటూ ఫ్రెండ్స్ పై కూడా కోప్పడిందట . అంతేకాదు ఇకపై అలా చేస్తే సహించను .. ఊరుకోను అంటూ స్ప్రైట్ వార్నింగ్ ఇచ్చిందట . దీంతో జాన్వి కపూర్ పేరు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . జాన్వి కపూర్ ఫ్యాన్స్ కూడా జాన్వీ కపూర్ ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలు పై మండిపడుతున్నారు . అయితే బోనీకపూర్ మాత్రం చాలా సైలెంట్గా ఉండిపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది..!