ప్రతి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ఎలా హీట్ పెంచేస్తుందో అందరికీ తెలుసు . సంక్రాంతి అంటేనే ఒక స్పెషల్ మూమెంట్ . కొత్త అల్లుళ్లతో.. కొత్త పిండి వంటలతో.. కోడిపందెలతో .. కొత్త ధాన్యాలతో బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు జనాలు. అయితే అలాంటి మూమెంట్లోనే కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతూ భారీ హిట్స్ అందుకుంటూ ఉంటాయి. కాగా ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి . అందులో బిగ్ బడా సినిమాలు కూడా ఉండడం గమనార్హం . పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా "గేమ్ చేంజర్".


కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది . కాగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మరొక పక్కన నెగిటివ్ టాక్ కూడా అందుకుంది . సినిమాలో పెద్దగా కథ ఏమీ లేదు అని సినిమా మొత్తం కూడా రాంచరణ్ హైలెట్ చేశారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. దీంతో సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినట్లయింది.  మరి కొద్ది గంటల్లోనే "డాకు మహారాజ్" సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . బాలయ్య ఈ సినిమాలో హీరోగా నటించాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకునింది .



సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు . కాగా 14వ తేదీ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై "గేమ్ చేంజర్" కి మించిన  స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ . మరీ ముఖ్యంగా చాలా కాలం తర్వాత వెంకటేష్ థియేటర్లో కనిపిస్తూ ఉండడం .. అది కూడా ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్టు కావడం వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాపై ఆశలు పెట్టుకునేలా చేసింది .



అంతేకాదు అనిల్ రావిపూడి దర్శకత్వం ఈ సినిమాకి బిగ్ ప్లస్ గా మారిపోతుంది అంటూ కూడా చెప్తున్నారు జనాలు . కొంతమంది సినిమా రిలీజ్ అవ్వకముందే నో డౌట్ సంక్రాంతికి రియల్ హీరో వెంకటేష్ .. గత ట్రాక్ రికార్డులని అవే చెప్తున్నాయి.  ఈ సంక్రాంతికి "సంక్రాంతి వస్తున్నాం" సినిమా మంచి టాక్ అందుకుంటుంది . అన్నిటికన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధించి సంక్రాంతి రేసులో రియల్ విన్నర్ గా నిలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూద్దాం మరికొద్ది రోజుల్లోనే ఆ విషయం కూడా తేలిపోబోతుంది..!?

మరింత సమాచారం తెలుసుకోండి: