దీంతో మరొక ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మాత్రం చాలా చాలా వైల్డ్ గా .. ఊర నాటు మాస్ డైలాగ్స్ తో రచ్చ రంబోలా లేపేసింది . కాగా ఈ ఈవెంట్లో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు . ముందు సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నట్లే మాట్లాడి తర్వాత బాలయ్యను ఓ రేంజ్ లో ప్రశంసలతో ముంచెత్తారు. "బాలయ్య చాలా చాలా మంచి వ్యక్తి అని .. చాలామంది హీరోస్ స్టార్ డైరెక్టర్ కి రెస్పెక్ట్ ఇస్తారు.. కానీ కొంతమంది డైరెక్టర్లకి విలువ ఇవ్వరు అని.. బాలయ్య సిగరెట్ తాగుతున్నప్పుడు ఎవరైనా అక్కడికి వెళ్తే సిగరెట్ ఆపేసి మరి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతారని.. మరికొందరు మాత్రం సిగరెట్ ఆర్పకుండానే తమ టెక్ చూపి అదే విధంగా డైరెక్టర్స్ తో మాట్లాడుతారు అని పరోక్షంగా పలువురు హీరోస్ ని టార్గెట్ చేసినట్లు మాట్లాడారు".
అఫ్కోర్స్ బాబి ఉద్దేశం వేరే హీరో ని టార్గెట్ చేయడం కాదు. బాలయ్యను పొగడం. కానీ బాలయ్య నీ పొగడడం అంటే వేరే హీరోలని తక్కువ చేయడమే . అలానే బాబీ చేసేసారు . అయితే ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ కూడా బాబి పై ఫైర్ అవుతున్నారు . బాలయ్య సిగరెట్ తాగుతాడు అన్న విషయం నువ్వు స్టేజిపై చెప్పడం అవసరమా..? నీకు బాలయ్యని పొగడడానికి వేరే ఎగ్జాంపుల్ ఏమి దొరకలేదా..? అంటూ మండిపడుతున్నారు . ఎప్పుడు చాలా పక్కాగా మాట్లాడే బాబి ఈసారి ఇలా టంగ్ స్లిప్ అవ్వడంతో కూసింత నెగిటివ్ ట్రోలింగ్ అందుకుంటున్నాడు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ బాబీ మాట్లాడిన మాటల తాలూకా వీడియో వైరల్ అవుతుంది..!