కాగా రీసెంట్గా ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన మరొక పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 నిందితుడిగా అరెస్టు అయిన అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో ఎలా ఏకేసారో జనాలు మనకు తెలుసు. అయితే మరీ ముఖ్యంగా కొంతమంది అల్లు అర్జున్ పర్సనల్ గా టార్గెట్ చేశారు . అల్లు అర్జున్ హెడ్ వెయిట్ అని .. ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటపడలేదు .. అంటూ ఘాటుగా ట్రోల్ చేశారు . అయితే రీసెంట్గా "గేమ్ చేంజర్" సినిమా రిలీజ్ అయింది . ఈ సినిమా కొంచెం నెగిటివ్ టాక్ కూడా సంపాదించుకుంది .
అయితే "గేమ్ చేంజర్" సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకుంది అన్న కారణంగానే అల్లు ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ చేసుకుంది అంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . కానీ అది నిజం కాదు . అల్లు అర్జున్ తన తండ్రి బర్త్డ డే సందర్భంగా ఇంట్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు . అంతవరకు ఓకే ..కానీ ఆ కేకే ఇక్కడ ఇప్పుడు పెద్ద తలనొప్పి క్రియేట్ చేసింది . "పుష్ప కా బాప్" అంటూ ఆ కేక్ పై ఉండడం పుష్ప అంటే ఓ బ్రాండ్ అనేలా హ్యాండ్ సింబల్ ఉండడం అందరికీ షాకింగ్ కి గురి చేసింది .
అంటే పుష్ప సినిమాని అన్ని సినిమాలు అందుకోలేవు .. వాటికి ఓ బ్రాండ్ ఉండాలి అనే రేంజ్ లో గేమ్ ఛేంజర్ కి ఎంత సర్కిల్ లేదు అనే విధంగానే ఇలా కేక్ ని క్రియేట్ చేయించారు అంటున్నారు కొంతమంది జనాలు . అయితే ఈ కారణంగా సోషల్ మీడియాలో బన్నీ హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు . ఐకానిక్ స్టార్ కి ఆ మాత్రం తెలీయదా ..? గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది.. అదే రోజు ఇలాంటి కేక్ కట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని.. అంటున్నారు జనాలు. అన్ని తెలిసే ఇలా చేశాడా..? ఆల్రెడీ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ హీట్ పెంచేస్తుంది. ఈ మూమెంట్లో ఈ "పుష్ప కా బాప్" కేక్ అవసరమా..? అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు. బన్నీ తెలిసి చేశాడు తెలియక చేశాడు కానీ ఇలా ఊహించని చిక్కుల్లో అయితే ఇరుక్కుపోయాడు..!