పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సీతారామం దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. పూర్తి పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ రూపొందనుందని సమాచారం.ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ ను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఓ బ్రిటీస్ సోల్జర్ గా కనిపించనున్నాడని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఈ క్రేజీ కు ఫౌజీ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసినట్లు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు హీరో ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవ పూడి, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు హాజరయ్యారు.అయితే ఇందులో ప్రభాస్‌ పక్కన ఓ కొత్త అమ్మాయి కనిపించింది.దీంతో ఈ సినిమాలో ఆమె హీరోయిన్ అని అర్థమైపోతుంది. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ ఆమె చూడలేదు. హను రాఘవపూడి తన సినిమాలో ప్రధానం కొత్త వాళ్లకే ప్రిఫరెన్స్‌ ఇస్తారనే విషయం తెలిసిందే.ఇప్పుడు అలాగే ఈసారి కూడా ప్రభాస్‌ కోసం కొత్త అమ్మాయిని తీసుకువచ్చారు. ఆమె పేరు ఇమాన్‌ ఇస్మాయిల్‌ అలియాస్‌ ఇమాన్వీ. ఢిల్లికి చెందిన ఈ అమ్మాయి.. సోషల్‌ మీడియా ద్వారా బాగా పాపులరైంది.ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్‌ వీడియోలతో భారీగా ఫాలోవర్సని సంపాదించుకుంది.

అలాగే ఎక్స్‌ లోనూ ఆమె ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఇప్పటి వరకు ఆమె ఏ సినిమాలోనూ కనిపించలేదు.కానీ, సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్‌తో హను రాఘవపూడి ప్రభాస్‌ సరసన ఆమెకు హీరోయిన్‌ చాన్స్‌ ఇచ్చాడట. దీంతో ఇమాన్వీ ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా నిలిచింది.దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇమాన్వీ అద్భుతమైన డ్యాన్సర్‌. ప్రస్తుతం ప్రైవేట్‌ కొరియోగ్రాఫర్‌ కొనసాగుతుంది.ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సరసన చాన్స్‌ కొట్టేసింది. ప్రస్తుతం ఇమాన్వీ అమెరికాలో ఉంటుందట. ప్రభాస్‌తో సినిమా కోసమే ఆమె ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది.ఇదిలావుండగా తన డ్యాన్స్ ట్యాలెంట్‌తో హను రాఘవపూడి కంట పడింది.. దాంతో దెబ్బకు జాతకం మారిపోయింది. ప్రస్తుతం ఫౌజీలో నటిస్తున్న ఈ బ్యూటీకి.. ఇది సెట్స్‌పై ఉండగానే ఆఫర్స్ వస్తున్నాయి.మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఇమాన్వికి పిలుపు అందుతుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఆషికి 3లో ఇమాన్విని హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ముందుగా ఇందులో యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రిని హీరోయిన్ అనుకున్నారు కానీ తాజాగా ఆమెను తప్పించి ఇమాన్వి వైపు అడుగులేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ పై క్లారిటీ రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అమ్మడి జాతకం మారిపోయినట్లే. ఎందుకంటే ఫౌజీ విడుదలైన తర్వాత ఎలాగూ ఇమాన్వి పేరు మార్మోగడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: