"గేమ్ చేంజర్"..టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా . ఈ సినిమా కోసం రాంచరణ్ ఎన్ని నిద్రలేని రాత్రుల్లు గడిపాడో.. ఎంత కష్టపడ్డాడో.. అందరికీ తెలిసిన విషయమే . ఫైనల్లీ సినిమా అనుకున్నంత హిట్ కాకపోయినా రాంచరణ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి . ఈ సినిమా మొత్తానికి కూడా హైలెట్ క్యారెక్టర్ "అప్పన్న"దే అంటూ రాంచరణ్ నటించిన తీరు అందరిని మెస్ మరైజ్ చేస్తుంది. చాలామంది ఈ సినిమా చూసిన తర్వాత తనపై అప్పన్న క్యారెక్టర్ లో మేము ఎక్కడ రామ్ చరణ్ ని చూడలేదు అని .. మెగాస్టార్ చిరంజీవిని చూస్తున్నట్లు అనిపించింది అని .. అంత చక్కగా నటించాడు రామ్ చరణ్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు .


అయితే సినిమాకి మంచి టాక్ వచ్చింది . రామ్ చరణ్ నటనకి అయితే ఏకంగా నేషనల్ అవార్డు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు . అయినా సరే రామ్ చరణ్సినిమా విషయంలో హ్యాపీగా లేరు అన్న టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.  దానికి కారణం అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా అంటూ తెలుస్తుంది. చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ జాతర పర్ఫామెన్స్ ఓ రేంజ్ లో పొగిడేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది స్టార్ సెలబ్రిటీస్ అల్లు అర్జున్ అలా నటించడం చూసి షాక్ అయ్యామని నిజంగానే అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ అని .. ఈ ఇయర్ నేషనల్ అవార్డ్ పక్క అంటూ ఓ రేంజ్ లో ప్రశంసిస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు .



అయితే రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పై మాత్రం అలాంటి కామెంట్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా వినిపించడం లేదు . కేవలం మెగా ఫ్యామిలీ హీరోస్ మాత్రమే గేమ్ చేంజర్ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు . దీంతో రామ్ చరణ్ కూసిమ్య అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . గేమ్ చేంజర్ సినిమా హిట్ అయిన రాంచరణ్ కి మాత్రం ఆ హ్యాపీనెస్ లేకుండా పోయింది . నేషనల్ అవార్డు వస్తుందో ..? రాదో..?  కానీ ఖచ్చితంగా ఈ సినిమాతో ఒక మైల్ స్టోన్ రీచ్ అవుతాడు రామ్ చరణ్ అంటున్నారు జనాలు. చూద్దాం నిజంగానే ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది ఏమో..??

మరింత సమాచారం తెలుసుకోండి: