"గేమ్ చేంజర్".."గేమ్ చేంజర్".."గేమ్ చేంజర్".. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ మూవీకి సంబంధించిన టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. చాలామంది ఈ మూవీకి సంబంధించిన విషయాలను ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . దానికి కారణం రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ . ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో అల్లాడించేసాడు అంటూ జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ చూపించిన పెర్ఫార్మెన్స్ చూడడానికి రెండు కళ్ళు చాలవు అంటూ యాంటీ మెగా ఫాన్స్ కూడా చెప్తూ ఉండడం సినిమాకి ప్లస్ గా మారింది. అయితే అక్కడక్కడ డైరెక్షన్ లో లోపాలు ఉండడం అసలు సినిమాలో కధే లేకపోవడం .. కీయరా అద్వానీ.. పాత్ర అసలు సెట్ కాకపోవడం మ్యూజిక్ పరంగా కొన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకోవడం ..ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చేలా చేసింది .


అసలు సినిమాలో "హైరానా" పాటని ఎత్తేసి శంకర్ చాలా చాలా తప్పు చేశాడు అంటున్నారు అభిమానులు.  సినిమా నుంచి అప్డేట్స్ వచ్చిన మూమెంట్లో ఈ పాటకి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.  మరి అలాంటి ఒక మంచి పాటని సినిమాలో ఎలా లేపేస్తారు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.  శంకర్ సినిమా కలెక్షన్స్ ని ఎక్కువగా రాబట్టేందుకే ఇలా సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ పాటను  థియేటర్స్ లో మళ్ళీ రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేశాడు అంటున్నారు . అయితే సినిమాకి అంత సీన్ లేదు అని కూడా టాక్ వినిపిస్తుంది . కాగా సినిమాలో హీరోయిన్లుగా నటించిన కీయరా అద్వానీ .. అంజలికి మంచి మార్కులే పడ్డాయి.



అంజలి కెరియర్ లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది అని .. రాంచరణ్ ఈవెంట్ లో చెప్పిన విధంగానే అంజలి కెరీర్ లోనే ఇది వన్ అఫ్ ది బెస్ట్ సినిమా గా ఉండిపోయింది అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాతో అంజలి మరికొన్ని సినిమా లకి ఆహ్వానం కూడా తన అందుకుని ఖాతాలో వేసుకుంటుంది అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు . కాగా నిజానికి శంకర్ .. అంజలి పాత్రలో ముందుగా మహానటి కీర్తి సురేష్ ని అనుకున్నారట . ట్రెడిషనల్ లుక్స్ లో దసరా మూవీలో ఆమె మెరిసిన విధానం చూసి శంకర్ ఈ డెసీషన్ తీసుకున్నారట.



కీర్తి సురేష్ కి కూడా ఈ ఆఫర్ ని వినిపించారట . కానీ క్యారెక్టర్ చిన్నది కావడంతో కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిందట . పైగా సెకండ్ హీరోయిన్ అనడంతో వెంటనే ఈ మూవీ ఆఫర్ ను పక్కన పెట్టేసిందట . అయితే కీర్తి సురేష్ బిగ్ తప్పు చేసింది అంటున్నారు జనాలు . చిన్న క్యారెక్టర్ అయినా సరే అంజలి పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా మారింది అని .. కొన్ని కొన్ని సార్లు చిన్న క్యారెక్టర్స్ మన కెరియర్ ని మలుపు తిప్పుతాయని..  కీర్తి సురేష్ తప్పు చేసింది అని మాట్లాడుకుంటున్నారు. ఆమె రీసెంట్గా నటించిన "బేబీ జాన్" సినిమా ఎంత ఫ్లాప్ టాప్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే.  ఒకవేళ కీర్తి సురేష్ "గేమ్ చేంజర్" చేసి  ఉంటే మాత్రం ఆమె కెరియర్ ముందుకు తీసుకెళ్లడానికి ఈ సినిమా బాగా హెల్ప్ అయి ఉండేది అని కూడా అంటున్నారు. బ్యాడ్ లక్ ఏం చేద్దాం..!??

మరింత సమాచారం తెలుసుకోండి: