గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అంజలి మరో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యస్ .జె. సూర్య, సునీల్, శ్రీకాంత్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మించారు.దిల్ రాజు నాలుగేళ్ల బడ్జెట్.. రామ్ చరణ్ మూడేళ్ళ కష్టం.. శంకర్ మేకింగ్.. ఇలా ఎన్నో అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ సినిమా విడుదలైంది. నిజం చెప్పాలంటే ఇండియన్ 2 ఫ్లాప్ అయిన తర్వాత కాస్త తక్కువ అంచనాలతో వచ్చింది గేమ్ ఛేంజర్. మరి వాటిని ఈ సినిమా అందుకుందా లేదా అనే చర్చ అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్య ఏ పెద్ద సినిమా విడుదలైనా కూడా నెగిటివ్ టాక్‌తోనే ఓపెన్ అవ్వడం కామన్‌గా మారింది. అది దేవర అయినా.. కల్కి అయినా.. పుష్ప అయినా.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ అయినా.. సినిమా ఏదైనా కూడా టాక్ అయితే తేడాగానే వస్తుంది. ఆ తర్వాత అవే సినిమాలు కనకవర్షం కురిపిస్తున్నాయి. తాజాగా గేమ్ ఛేంజర్ విషయంలోనూ ఇదే జరుగుతుందని నమ్ముతున్నారు అభిమానులు. అయితే కొందరు ఇస్తున్న కంప్లైంట్ మాత్రం మరోలా ఉంది.ఫస్టాఫ్ పర్లేదు.. కొన్ని మూమెంట్స్ ఉన్నాయి.

సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓకే అనిపిస్తుంది.. ఆ 20 నిమిషాలు అప్పన్న పాత్రలో అదరగొట్టాడు రామ్ చరణ్.. ఫ్లాష్ బ్యాక్ పూర్తయిన తర్వాత కథ ఎక్కడో గాడి తప్పినట్టు అనిపించిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. రామ్ చరణ్, ఎస్ జే సూర్య మధ్య వచ్చే టిట్ ఫర్ ట్యాట్ సీన్స్ బాగా పేలాయి. ఒక కలెక్టర్ తలుచుకుంటే ఏం చేస్తాడు.. అతనికి ఎన్ని పవర్స్ ఉన్నాయి అనేది మాత్రం చాలా బాగా చూపించాడు శంకర్. ముక్కలు ముక్కలుగా గేమ్ చేంజర్ అదిరిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. మొత్తం సినిమాగా చూసుకుంటే మాత్రం ఎక్కడో శంకర్ మార్క్ మిస్ అయిందంటున్నారు. ఇదిలావుండగా రంగస్థలం'లో రామ్‌చరణ్‌ నటనకు జాతీయ అవార్డు వస్తుందనుకున్నానని సినీ దర్శకుడు సుకుమార్‌అన్నారు. 'గేమ్‌ ఛేంజర్‌'  క్లైమాక్స్‌లో చరణ్‌ నటనకు కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక  అమెరికాలో అట్టహాసంగా నిర్వహించారు. ఈవెంట్‌లో పాల్గొన్న సుకుమార్‌ మాట్లాడారు.
చిరంజీవిగారితో కలిసి 'గేమ్‌ ఛేంజర్‌' చూశా. ఫస్ట్‌ రివ్యూ నేనే ఇస్తా. ఫస్ట్‌ హాఫ్‌ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్‌ బ్లాక్‌ బస్టర్‌.


సెకండాఫ్‌లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ చూస్తే గగుర్పాటు కలుగుతుంది.రంగస్థలం' మూవీకి చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అందరం అనుకున్నాం. ఈ మూవీ క్లైమాక్స్‌ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్‌ కలిగింది. అంతకన్నా ఎక్కువే అనిపించింది. చాలా బాగా చేశాడు. ఈ నటనకు ఈసారి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా'' సుకుమార్‌ అని అన్నారు.సినిమా రిలీజ్ అయ్యాక అందరూ సుకుమార్ కామెంట్స్ ని గుర్తు చేసుకుని...ఇదేంటి ఇలా మాట్లాడారు అంటున్నారు. అసలు సుకుమార్ సినిమా మొత్తం చూసారా..లేక ఎపిసోడ్స్ చూసి అలా అన్నారా, ఫైనల్ కట్ చూసి ఉండరు అని చెప్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ బాగానే ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ, డెప్త్, ఇంటెన్సిటీ మిస్సైందని, సుకుమార్ కామెంట్స్ విని చాలా ఎక్సపెక్ట్ చేసిన వాళ్లు నిరాశపడ్డారు. సోషల్ మీడియాలో ఈ విషయమై డిస్కషన్ జరుగుతోంది.అయితే సంక్రాంతి సీజన్ కావడంతో ఈ టాక్ ఏం పని చేయదని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: