గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబడుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ వేదికగా రియాక్ట్ కావడంతో మెగాభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి చాలా హ్యాపీగా ఉన్నట్లుగా వారు చెప్పుకు రావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ... "అప్పన్న పాత్రలోనూ ఇక వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే నిజాయితీగల ఐఏఎస్ అధికారి పాత్రలో కూడా రామ్ చరణ్ (రామ్ నందన్‌) నటన అద్భుతం. అదేవిధంగా సినిమాలో నటించిన ఎస్ జె సూర్య, అంజలి, కియారా అద్వాణీ, నిర్మాత దిల్ రాజులకు అభినందనలు తెలుపుతున్నాను." అంటూ రాసుకొచ్చారు. దాంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చిరు వ్యాఖ్యానిస్తూ... డైరెక్టర్ శంకర్, ఒక పొలిటికల్ డ్రామాకు ఎలాంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు తీసుకోవాలో అలాంటి వారిని తీసుకొని ఈ సినిమాను శంకర్ రూపొందించినందుకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు... అంటూ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్పందిస్తూ.. "నా ప్రియమైన భర్త రామ్ చరణ్‌కు థాంక్స్. నిజంగా మీరు అన్ని విధాలుగా గేమ్ చేంజర్. లవ్ యూ!" అని ట్వీట్ చేసారు. ఈ క్రమంలో విమర్శకుల అభిప్రాయాలతో ఉన్న పోస్టర్‌ని షేర్ చేశారు కూడా. దాంతో ప్రస్తుతం చిరు, ఉపాసనల పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే... గేమ్ చేంజర్ చిత్రం నిన్న (జనవరి 10)న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొట్టిన సంగతి విదితమే. నెల్లూరులో తొలి రోజున ఏకంగా 103 షోస్ ప్రదర్శితం కానుండడంతో ఈ రికార్డ్ నమోదు అయింది. తద్వారా మొదటి రోజున ఏకంగా నెల్లూరులో ఏకంగా రూ.1.15 కోట్ల గ్రాస్ వసూలు చేయడం గమనార్హం. నెల్లూరు సిటీ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డు అని సినీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: