గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. అందరూ 40 నుంచి 50 కోట్లు వస్తే... ఎక్కువ అంటూ గేమ్ చేంజర్ సినిమాపై విష ప్రచారం చేశారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే గేమ్ చేంజర్ చిత్ర బృందం అధికారిక పోస్టర్ను రిలీజ్ చేసింది.

 ఈ పోస్టర్ ప్రకారం తొలిరోజు గేమ్ చేంజెస్ సినిమాకు 186 కోట్లు వచ్చాయి.  ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేసి మరి స్పష్టం చేసింది గేమ్ చేజర్ టీం. ప్రపంచవ్యాప్తంగా... బాక్స్ ఆఫీస్ ను గేమ్ చేంజర్ సినిమా షేక్ చేసినట్లు పేర్కొంది.  ఇవి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ అని తెలిపింది.  ఇక 186 కోట్లు గేమ్ చేంజర్ వసూలు చేయడంతో... జూనియర్ ఎన్టీఆర్ కు షాక్ తగిలింది.

 జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రికార్డులు బ్రేక్ చేసింది గేమ్ చేజర్ సినిమా.  జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మొదటి రోజు 172 కోట్లు వసూలు చేసింది. దింతో దేవర సినిమా రికార్డులు గేమ్ చేంజర్... బ్రేక్ చేసినట్లఅయింది.  అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప  2 సినిమా మాత్రం మొదటి రోజు 294 కోట్లు వసూలు చేయడం జరిగింది. ఇలా ఒక్కరోజులో 294 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమాగా పుష్ప 2 రికార్డు లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.

 అయితే పుష్ప రికార్డులు బ్రేక్ చేసేందుకు గాను.. గేమ్ చేంజర్ సినిమా విశ్వప్రయత్నాలు చేసింది. కానీ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది. నిన్న బాగానే కలెక్షన్స్ వచ్చినప్పటికీ... ఇవాల్టి నుంచి గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ తగ్గుతాయని చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో రాంచరణ్ హీరోగా చేయగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్గా చేసింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు ప్రొడక్షన్ అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: