తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీలలో నిత్యా మీనన్ ఒకరు. ఈమె నితిన్ హీరో గా రూపొందిన ఇష్క్ అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె అనేక తెలుగు సినిమాల్లో నటించింది. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈమె చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన దశలో కెరియర్ ను ముందుకు సాగించింది.

నిత్యా మీనన్ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి నటిగా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కి జోడి గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ కాదలిక్క నేరమిల్లై అరే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ లో జయం రవి హీరో గా నటించాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా నిత్యా మీనన్ మాట్లాడుతూ ... నేను కొన్ని సంవత్సరాల క్రితం సినిమాలు పూర్తిగా వదిలేయాలి అనుకున్నాను. కానీ జాతీయ అవార్డు నా ఆలోచన మొత్తాన్ని మార్చేసింది. జాతీయ అవార్డు వచ్చిన తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీ లో కొనసాగాలి అనుకున్నాను అని నిత్యా మీనన్ తాజాగా చెప్పుకొచ్చింది. తాజాగా నిత్యా మీనన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఫుల్ గా వైరల్ గా అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: