ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమాలు దాదాపుగా మూడు గంటలు , అంతకు మించిన నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దానితో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకి వస్తాయి అని చాలామంది భావించారు. కానీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోయే ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో ఏ సినిమాలు కూడా మూడు గంటలకు దగ్గరగా కూడా రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా విడుదల అయింది. దాదాపు శంకర్ గత సినిమాల్లో చాలా వరకు మూవీలు మూడు గంటలు లేదా మూడు గంటలకు అత్యంత దగ్గర నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కేవలం 2 గంటల 45 నిమిషాల నడిపితోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే రేపు అనగా జనవరి 12 వ తేదీన నందమూరి బాలకృష్ణ హీరో గా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమా విడుదల కానుంది.

సినిమా కూడా మూడు గంటలకు చాలా తక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కేవలం రెండున్నర గంటల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా విడుదల కానుంది. ఈ మూవీ ని జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కూడా దాదాపు రెండున్నర గంటల రన్ టైమ్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: