పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కగా ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో నిరాశకు గురి చేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తు సీన్లు బాగానే ఉన్నా ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చే విధంగా గేమ్ ఛేంజర్ సినిమా లేకపోవడం గమనార్హం. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో సైతం ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన విధంగా లేవు.
గేమ్ ఛేంజర్ మూవీ పుంజుకుంటుందా అనే ప్రశ్న సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైతే థియేటర్ల దగ్గర కళ మామూలుగా ఉండదు. గేమ్ ఛేంజర్ మూవీ విషయంలో మాత్రం ఎలాంటి పరిస్థితి లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు ఇతర భాషల్లో సైతం ఆశించిన స్థాయిలో అయితే రాలేదని చెప్పవచ్చు.
నార్త్ ఇండియాలో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడం ఈ సినిమాకు సులువు కాదని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంవత్సరానికి శుభారంభాన్ని ఇవ్వలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు సరైన స్థాయిలో ప్రమోషన్స్ కూడా జరగడం లేదని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.