నందమూరి నట సింహం బాలకృష్ణ కెరియర్లో అనేక అద్భుతమైన విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ కెరియర్ లో ఇంట్రెస్ట్ హిట్ కొట్టిన సినిమాల లిస్టులో సమరసింహారెడ్డి , నరసింహ నాయుడు మూవీలు కూడా ఉన్నాయి. ఈ రెండు మూవీ లు కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. ఇకపోతే తాజాగా బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా , శ్రద్ధ శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ నటించారు.

ఇకపోతే ఈ ముగ్గురు ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాబీ మాట్లాడుతూ ... డాకు మహారాజ్ సినిమా బాలకృష్ణ కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు అయినటువంటి సమరసింహారెడ్డి , నరసింహ నాయుడు సినిమాల రేంజ్ లో ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. దానితో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి.

ఇక ఈ రెండు సినిమాల్లో కూడా ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఈ సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు బలంగా రావడంతో బాబి , బాలకృష్ణ కెరియర్లో బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించిన సమరసింహారెడ్డి , నరసింహ నాయుడు సినిమాల రిఫరెన్స్ లను బాగా పాడినట్లు ఉన్నాడు. కచ్చితంగా ఈ సినిమా కూడా ఆ రెండు సిన స్థాయి విజయాన్ని అందుకుంటుంది అని ఆశాభావాన్ని బాలయ్య అభిమానులు గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ టాక్ ను తెచ్చుకొని ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: