తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ ను కొనసాగించిన వారిలో బి గోపాల్ ఒకరు. ఈయన కెరియర్ లో ఒకే వారం గ్యాప్ లో ఒక అరుదైన సంఘటన జరిగింది. ఒక సినిమాతో ఈయనకు భారీ ఫ్లాప్ వస్తే మరొక సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హీట్ వచ్చింది. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అల్లరి రాముడు అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ , గజాల హీరోయిన్ లుగా నటించగా ... నగ్మా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాను 2022 జూలై 18 వ తేదీన విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన వారం రోజులకు ఈయన దర్శకత్వం వహించిన ఇంద్ర సినిమా విడుదల అయింది. ఈ సినిమా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్ లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఇంద్ర సినిమా 2002 వ సంవత్సరం జూలై 24 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించగా ... ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా చాలా కాలం పాటు కొనసాగిన బి గోపాల్ కెరియర్ లో 2002 సంవత్సరంలో కేవలం ఒకే వారం గ్యాప్ లో మొదటగా వచ్చిన అల్లరి రాముడు సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొడితే , ఆ తర్వాత వారం రోజులకు వచ్చిన ఇంద్ర మూవీ ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: