మరీ ముఖ్యంగా రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా లో అసలు కథ మిస్ అయింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి . కాగా ఇప్పుడు జనాలు గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత ఓ విషయాన్ని ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమా "దేవర" . ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . తెలుగు జనాలను కూడా "దేవర" నిరాశపరిచింది . అయితే ఆర్ఆర్ఆర్ లో మరొక హీరోగా నటించిన రామ్ చరణ్ నుంచి వస్తున్న పెద్ద బడా పాన్ ఇండియా సినిమా "గేమ్ చేంజర్:.. కచ్చితంగా ఆ లోటును తీర్చేస్తుంది అంటూ చరణ్ అభిమానులు బాగా ఎక్స్పెక్ట్ చేశారు.
కానీ చరణ్ కూడా ఆ స్పెషల్ మార్క్ ని అందుకోలేకపోయాడు . ఆర్.ఆర్.ఆర్ తర్వాత అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ ఆ పాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకోలేక పోయారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆచార్య సినిమాలో కనిపించాడు రామ్ చరణ్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అందులో చిరంజీవి నే హైలెట్..చరణ్ ది చాలా చిన్న పాత్ర . అయితే గేమ్ చేంజర్ లో మాత్రం రామ్ చరణ్ హీరో . ఆయన ఈ సినిమాకి కీలకం. నటనపరంగా మంచి మార్కులు దక్కించుకున్నాడు కానీ ఇమేజ్ పరంగా మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా నిరాశపరిచింది. దీంతో రాజమౌళి డైరెక్షన్ ని అందరూ పొగిడేస్తున్నారు. ఎటువంటి హీరో అయినా సరే రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే అది సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే అంటూ మాట్లాడుతున్నారు. మొత్తానికి అటు తారక్ ఇటు రామ్ చరణ్ లకు ఇద్దరికి పాన్ ఇండియా ఇమేజ్ కంటిన్యూ చేయాలి అన్న ఆశ నిరాశగానే మిగిలిపోయేలా చేశారు డైరెక్టర్లు . చూద్దాం నెక్స్ట్ అయినా వీళ్ళకి అలాంటి ఇమేజ్ దక్కుతుందో...? లేదో..??